* కనప్పండగనాడు కంచంలో ఎముక ఘల్లుమంటే కాశీలో గంట మ్రోగించినంత పుణ్యం.
* కునికిపాట్లు పడేవానికి కూలబడి తన్నేవాడే తండ్రి.
* కుప్ప తగులబెట్టి పేలాలు వేయించుకొన్నట్లు.
* కుప్ప పీకే దొంగ పరిగ ఏరుకొనేవానిని బెదిరించినట్లు.
* కుప్పపై పండుకొని ఉప్పరిగా కలగన్నట్లు.
* కుప్పలో కేడిగింజ, కులంలో కులాల కోడలు.
* కుప్పలో ధాన్యమున్నట్లు.
* కుప్ప విత్తనాలు-చప్పనారు.
* కుమ్మక్కు నాది, ఫజీతు నీది. (ఫజీతు=అవమానము).
* కుమ్మరపురుగుకు మన్ను ఒంటబట్టునా?
* కుమ్మర వీధిలో కుండలమ్మినట్లు.
* కుమ్మరావంలో గచ్చకాయ వేసినట్లు.
* కుమ్మరావంలో రాగిముంతలేరగలమా?
* కుమ్మరికి ఒక ఏడు, గుదియకు ఒకఏటు (దెబ్బ).
* కుమ్మరికి కుండ కఱవా? కమ్మరికి తెడ్డు కఱవా?
* కుమ్మరికి కుండ కఱవు, సాలెకు బట్ట కఱవు ఉండునా?
* కుమ్మరికి కుండల కఱవు, మాదిగకు చెప్పుల కఱవు ఉండవు.
* కుమ్మరిలేకుండా కుండ పుట్టునా?
* కుమ్మరివారి కోడలు ఆవం దగ్గరైనా కనుపించదా?
* కుమ్మరివారింటి కోడలు ఆవంకట్టకు రాకుండా ఎక్కడీకిపోతుంది?
* కుమ్మకాదా కూతురా? అంటే ముసలి మొగుడే అమ్మా అన్నదిట.
* కుమ్ము చెప్పుకొనేదానికి గూడూరుపోతే, ఏడూళ్ళ కుమ్ము ఎదురుగా వచ్చిందట.
* కుమ్మెతక్క పూలుగుచ్చితే, కురిమెళ్ళ కామాక్షమ్మ కులికి వస్తుంది.
* కుమ్మేమిటే కూతురా? అంటే, అవ్వకు ఱంకుమొగుడే అన్నదిట.
* కురవోళ్ళ పిల్ల బాయిలో పడితే ఎలిగోళ్ళ పిల్ల ఎక్కి ఎక్కి ఏడ్చిందట (కురవళ్ళ పిల్ల=గొల్ల కురవజాతి పిల్ల).
* కురూపి పొత్తు కంటే, సురూపి తిట్టు మేలు.
* కురూపీ ఏంచేస్తున్నావంటే, సురూపాల వెక్కిరిస్తున్నాను అన్నట్లు.
* కుఱ్ఱవాడి గుణగణాలు తెలుసుగానీ, చెవులకమ్మల సంగతి మాత్రం తెలీదు అన్నట్లు.
* కులం కన్నా గుణం ప్రధానం.
* కులం కొద్ది గుణం.

No comments:
Post a Comment