Saturday, June 15, 2019

క - ఖ >>>> 26

* కూచిపూడి దొంగతనానికి కఱ్ఱ చెప్పులు కావలెనా?
* కూచిపూడిలో కుక్క మొరిగినా సంగీతమే.
* కూచుంటే లేవలేడు, కూరకట్టలమ్మ లేడు, కొట్టొస్తాడమ్మా! నాకు నవ్వొస్తాది.
* కూచుంటే లేవలేడు, కూరకచట్టి దించలేడు, మా బావ కొట్టొస్తాడే! నాకు నవ్వొస్తాదే.
* కూటికి గతిలేదుకానీ కుంటెనలకు ముత్యాలు.
* కూటికి గింజలు, పనికి కొరముట్లు లేక చేసే సేద్యం రోత.
* కూటికి జరిగితే కోటికి జరిగినట్లు.
* కూటికి తక్కువైతే కులానికి తక్కువా?
* కూటికి పేదైతే కులానికి పేదా?
* కూటికియ్యని విటకాని పోటు మెండు.
* కూటికి లేకున్నా కాటుక చుక్క మానదు.
* కూటికి లేని నాబట్టా, గుడ్డకులేని నా బిడ్డ వెంటబడ్డావా?
* కూటికుంటే కోటికున్నట్లు.
* కూటికుండ కుక్క ముట్టినట్లు.
* కూటిపేద తోడు పోగొట్టుకుంటాడు.
* కూటిమీదా ఆశ, మీసం మీదా ఆశ.
* కూటిలోని రాయి తీయలేనివాడు ఏటిలోని రాయి తియ్యగలడా?
* కూడబెట్టినవాడు కుడువ నేర్చునా?
* కూడబెట్టిన సొమ్ము కుడూవను రాదు.
* కూడలి కాపురం కుతకుతలు, వేరడి కాపురం వెతవెతలు.
* కూడా తిని కులమెంచినట్లు.
* కూడినకొద్దీ కుండలమ్ముకొని తినినట్లు.
* కూడి యాడెడువాడె పో గోవిందుడు.
* కూడుండగానే కులాలవాళ్ళ కుడిపైట మారదు.
* కూడు ఐతే కద్దుగానీ కులస్థులకు వెరచి వచ్చినాను.
* కూడు ఉంటే కులగోత్రాలెందుకు?
* కూడు ఉడకలేదని కుండట్టుక కొట్టాడట.
* కూడు ఉడీకిన వెనుక పొయ్యి మండును, కులం చెడ్డవెనుక బుద్ధి వచ్చును.
* కూడు ఎక్కువైతే కువ్వాడ మెక్కువ (కువ్వాడం=ఓర్వలేనితనం).
* కూడు ఒల్లనమ్మను కఱవేమి చేస్తుంది?

No comments:

Post a Comment