Saturday, June 15, 2019

క - ఖ >>>> 27

* కూడు గుడ్డ తానుగోరునా దైవంబు.
* కూడు కలుగగానే కులం మరచిపోతారు.
* కూడు గుండెకాయ, మెతుకు మేనమామ.
* కూడు చీర లేని చోటు కొరగానిది.
* కూడు పారవేసి కొప్పెర నాకినట్లు.
* కూడు పెట్టడు, గుడ్డ ఇవ్వడు, నామీద ప్రాణమే అన్నట్లు.
* కూడు పెట్టినామెను తొడవిందు అడిగినట్లు.
* కూడులేక కూరదిన్న ఆకలి తీరునా?
* కూడు లేనమ్మకు గుడ్డలేని వాడు జత పడ్డట్లు.
* కూడు వండని ఆడది, మంచం అల్లని మగవాడూ ఉండరు.
* కూడూవండుట గంజి కొరకా?
* కూడు వేడైతే కూరాకు నంజినట్లు.
* కూడూ, గుడ్డా అడక్కపోతే, బిడ్డని సాకినట్లు సాకుతా అన్నాడట.
* కూడేకూడే కాపురం తియ్యకపోతే నీ ఱంకు మొగుణ్ణి కాదన్నాడట.
* కూతలార్భాటమే కానీ కుప్పలో ఇత్తులు లేవు.
* కూతును గుత్తరూకలమ్మేవాడు అల్లునికి అరణమిచ్చునా?
* కూతురికి దొరికేదంతా కుళాయి మిండగాళ్ళే.
* కూతురుకి మంగళవారం, శుక్రవారం కోడలికి దివ్వెలు దివ్వెలు.
* కూతురి పురుడు కుండల్లో, కోడలి పురుడు కొందల్లో.
* కూతురు అని కుంచడిస్తే, కన్న తల్లి అని కంచెడు పెట్టిందట.
* కూతురు కనలేకపోతే అల్లుడి మీద పడి ఏడ్చినట్లు.
* కూతురు చెడితే తప్పు తల్లిది.
* కూతురు బిడ్డవని కోరితెచ్చుకుంటే కానే కొరివైనావా నా మనమరాలా?
* కూతుళ్ళ కన్నమ్మకు కుర్చీపీటలు, కొడుకులు కన్నమ్మకు గోడపంచలు.
* కూతుళ్ళుకన్నమ్మ కుశలేసులలో, కొడుకులు కన్నమ్మ లబ్బీసులో.
* కూనపులికి లేడి దేటా?
* కూనలమ్మ సంగీతం వింటే పుణ్యమూలేదు, వినకపోతే పాపమూ లేదు.
* కూనలు కూటికేడుస్తుంటే, అవ్వ ఱంకు మొగుడికేడ్చిందట.
* కూర ఎంతైనా కూడు కాదు.
* కూరకుండ మొదలుంటే, కూసుముండైనా చేస్తుంది కాపురం.

No comments:

Post a Comment