Saturday, June 15, 2019

క - ఖ >>>> 28

* కూరకు తాళింపు, చీరకు జాడింపు.
* కూరగాయలు చెడిపోయినవంటే, బఱ్ఱెలకు వేయమన్నాడట, అవి తినవంటే, పిలిచి బ్రాహ్మడి కివ్వమన్నాడట.
* కూరలేని తిండి కుక్క తిండి.
* కూరలో కసవేరినట్లు.
* కూరిమి కలిగిన దినములలో నేరములెన్నడును కలుగ నేరవు.
* కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు.
* కూర్చుంటే కుంటి, లేస్తే లేడి.
* కూర్చుంటే కుక్కైనా కఱవదు.
* కూర్చుండి కూర వందలేను, వంగుండి తీర్ధం వస్తాను అన్నట్లు.
* కూర్చుండి చేసినపాపం గుడి కట్టినా పోదు.
* కూర్చుండి తింటూ ఉంటే కొండయినా కరిగిపోతుంది.
* కూర్చుండి తింటే, గుళ్ళుగోపురాలు ఆగవు.
* కూర్చుండి లేవలేని వాడు, ఎగసి తాటికాయ తంతానంటాడు.
* కూర్చుండి లేవలేనమ్మ వంగుని శివరాత్రికి వస్తానన్నదిట.
* కూర్చున్నవానికి కుప్పలు, తిరిగిన వానికి తిప్పలు.
* కూర్చోమంటే గుద్దకు, తినమంటే నోటికి తెగులు.
* కూలబడీన కుండా కుదురుట అరుదయా.
* కూటికి ఏడిస్తే కొలుకులు తడౌతవా?
* కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు.
* కూలి కుండకు రాదు, ఱంకు పన్నుకు రాదు.
* కూలి కూటికి రాదు, లేకి చేతికి రాడు.
* కూలి చేస్తే కుండకాలె, లేకుంటే పొట్టకాలె.
* కూలికి వచ్చినవాడు పనిగొనక మానునా?
* కూలిబంటు కొక మాలబంటు, మాలబంటు కొక మద్దెలకాడు.
* కూలీనాలీ చేసి కుదురాల ఉండక, మొగుణ్ణి కట్టుకొని సగమై పోతినే అందిట.
* కూలివాడి ప్రొద్దా, క్రుంకవే పొద్దా.
* కూశమ్మ కూడబెడితే మాశమ్మ మాయం చేసిందట.
* కూసుముండ నొరు కుట్టిపెట్టితే అయ్యవారా ఏం టెంకాయకు పసుపు పూయలేదు అన్నదిట.
* కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెఱచిందట (చెఱచినట్లు).
* కూసీకూసీ గుంటనక్క గూదెల్లి చచ్చిందట.

No comments:

Post a Comment