* కృతఘ్నత ప్రతిదేశంలో ప్రతివాతావరణంలో మొలిచే కలుపుమొక్క.
* కృతమెఱుంగని వానికి మిత్రద్రోహ మెంత?
* కృత్తికలో కుతికె పిసుకుడు.
* కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు.
* కెంపు నేనెఱుగనా? (కుంపటివలె) కోతికివలె రెండు కొమ్ములుండు.
* కైకపుట్టి చెరచెగా రాము(ని) పట్టంబు.
* కొంగ కన్నులు మూసుకోగానే దేవతల ధ్యానమగునా?
* కొంగకొక చెఱువనీ లేదు, కోమటికొక ఊరనీ లేదు.
* కొంగ జపము చేపల కొఱకే.
* కొంగలు గుమికూడి కొరకవా బోదెలు.
* కొంగ వంటి ధ్యానముచే తన కోర్కెలు నెరవేరునా?
* కొంగు తగిలినా కొంత మేలే.
* కొంగు తాకితే కోటివరహాలు.
* కొంచెమైనను పంచి కుడువ మేలు.
* కొంగు తడిస్తే చలిగానీ కోకంతా తడిస్తే ఏంచలి?
* కొంగు తడీస్తే వగకానీ, కోకంతా తడిస్తే వగపేమి?
* కొంటిమి, తింటిమి, కోలాటమెందుకు?
* కొంటే రానిది కొసరితే వస్తుందా?
* కొండంత తనతప్పు గోరంత, గోరంత ఒరుతప్పు కొండంత.
* కొండంత తెలివికంటే గోరంత కలిమి మేలు.
* కొండంత దూదికి కొండంత నిప్పెందుకు?
* కొండంత దేవునికి కొండంత పత్రి పెట్టగలమా?
* కొండంత దేవునికి గోరంత బెల్లం నైవేద్యం.
* కొండంత మదపుటెనుగకి తొండము లేకపోతే జంత్రము కీలూడినట్లు.
* కొండంత రాగంతీసి పిచ్చికుంట్ల పాట పాడినట్లు.
* కొండంత రెడ్డి కొంగుపట్టుకుంటే లేదనేదెట్లా అన్నదిట.
* కొండంత మొగుడేపోగా పిడికెడు బొచ్చుకెందుకు ఏడ్పు?
* కొండ అద్దమందు కొంచమై ఉండదా?
* కొండ ఎక్కేవాని ముడ్డీలో కొడవలి చెక్కినట్లు.
* కొండ ఎక్కేవాని ముడ్డిలో (గుద్దలో) కొడవలి చెక్కి వచ్చేటప్పుడు పచ్చిగడ్డి తెమ్మన్నట్లు.

No comments:
Post a Comment