Saturday, June 15, 2019

క - ఖ >>>> 30

* కొండకు కట్టెలు, కోనేటికి నీళ్ళు మోసినట్లు.
* కొండకింద మెరక, తూము కింద మెరక మంచిది.
* కొండకు వెంట్రుక ముడీవేస్తే, వస్తే కొండే వస్తుంది, పోతే వెంట్రుకే పోతుంది.
* కొండతో తగరు ఢీ కొన్నట్లు.
* కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక కాస్తా ఊడి (ఊడ్చుకొని) పోయిందట.
* కొండను చదరపెట్టి, ఉలవ చల్లినట్లు.
* కొండను తలకింద పెట్టుకొని రాళ్ళను వెతికినట్లు.
* కొండను తవ్వి ఎలకను పట్టినట్లు.
* కొండమంగలి గొరిగినట్లు.
* కొండలు మింగేవానికి గోపురాలడ్డమా? గుడి మింగేవానికి లింగమడ్డమా?
* కొండమిరపకాయ కారం జాస్తీ, పొట్టివానికి బుద్దులు జాస్తి.
* కొండమీద గోల ఏమంటే కోమట్ల గుసగుసలన్నట్లు.
* కొందమీంచి పడ్డవానికి గాయాలెన్ని- అన్నట్లు.
* కొండమీదికి భక్ష్యాలకి పోతే కొండకింద పాయసం పోయిందట.
* కొండముచ్చు పెళ్ళికి కోతి పేరంటాలు.
* కొండలు పడ్డ కొన్నాళ్ళకి కోనలూ పడూను.
* కొండలు పిండి కొట్టినట్లు.
* కొండవలేవచ్చి మంచువలే తేలినట్లు.
* కొండవలే వచ్చి బెండువలే తేలినట్లు.
* కొండవీటి చేంతాడు.
* కొండవీటి దండుముండా, కుండలిటు తేవే.
* కొండీ! కొండీ ! కుండలిటు తేవే అంటే, చస్తి నీ కాళ్ళకు మొక్కుతా, దీపమిటుతే అందిట.
* కొండూరు జంగాలు, తరుణాయి సన్నాసులు.
* కోండ్రను నమ్మిన వారికి కొదువలేదు.
* కొందరిని కొంతకాలం ఏమార్చవచ్చునుగానీ, అందరినీ అంతకాలమూ ఏమార్చలేము.
* కొంప అంటుకపోతూ ఉంటే నీళ్ళబాన నిప్పు దగ్గర పెట్టిందట.
* కొంపచెరుపకురా సుపుత్రా!
* కొక్కిరాయీ! కొక్కిరాయీ ! ఎందుకు పుట్టావే ? అంటే చక్కని వాళ్ళని వెక్కిరించటానికి అన్నదట.
* కొక్కిరాయుళ్ళలో కొంగ ఘనము.
* కొక్కొరొక్కో అనగానే తెల్లవారినట్లా?

No comments:

Post a Comment