Saturday, June 15, 2019

ఇ - ఈ >>>> 2

* ఇంటికి ముసలి కీడు, ఏటికి మొసలి కీడు.
* ఇంటికి హేళనైతే బంటుకు హేళన, బంటుకు హేళనైతే బంచకూ హేళన.
* ఇంటికూటికీ, దోవకూటికి రెంటికి చెడినట్లు.
* ఇంటికూడుతిని ఱంకు మొగుళ్ళ వెంటపడినట్లు.
* ఇంటి కోడళ్ళు తిన్నా కోళ్ళు తిన్నా వృధాగా పోదు.
* ఇంటి గుట్టు పెరుమాళ్ళ కెరుక.
* ఇంటిగుట్టు లంకకు చేటు.
* ఇంటిదీపమని ముద్దు పెట్టుకుంటే, మీసాలన్నీ తెగకాలినవట.
* ఇంటిదొంగను ఈశ్వరుడైనా పట్టలేడు.
* ఇంటినిండా కోళ్ళున్నా పక్కింటి కోడే కూయాల్సి వచ్చింది.
* ఇంటిపిల్ల ఇగిలిస్తే, లంజపిల్ల గంజికేడ్చిందట.
* ఇంటికి పెద్దకొడుకై పుట్టేకన్నా, అడవిలో తుమ్మదుబ్బై పుట్టేది మేలు.
* ఇంటికి పెద్దకొడుకు, పెద్దాల్లుడే లెక్కబడేది.
* ఇంటిపేరు కస్తూరివారు, ఇంట్లో గబ్బిలాల (పెంట) కంపు.
* ఇంటిపేరు క్షీరసాగరం వారు, ఇంట్లో మజ్జిగచుక్కకు గతిలేదు.
* ఇంటిమగనికి ఈచ(త) కట్లు, బయటి మొగనికి తాటికట్లు.
* ఇంటిమగనికి ఎద్దుబండి, బయటి మొగనికి గుఱ్ఱలబండి.
* ఇంటిమీద రాయి వేసి, వీపు ఒగ్గినట్లు.
* ఇంటిమొగుడు కుంటెనకాడైతే (తార్పుడుకాడు) ఱంకుకు రామేశ్వరం పోవలెనా?
* ఇంటిమొగుడు మట్టిగబ్బు, పొరుగింటి మొగుడు పూలవాసన.
* ఇంటిలక్ష్మిని ఇంటివాకిలి చెబుతుంది.
* ఇంటివాడివలే చేసేవాడులేడు, బయటివాడివలే తినేవాడూ లేడు.
* ఇంటివాడు 'ఇలో' అంటే బయటివాడు 'పొలో' అన్నాడుట.
* ఇంటివాడు ఈకన కొడితే, బయటివాడు పోకన కొడతాడు.
* ఇంటివాడు గొడ్డు గేదంటే పొరుగువాడు పాడిగేదె అన్నట్లు.
* ఇంటివాడు లేచేది కుంటివాడిమీదకే.
* ఇంటివాణ్ణి లేపి దొంగచేతికి కట్టె ఇచ్చినట్లు.
* ఇంటివానికి చులకనైతే బయటవానికి చులకన, బానిసవానికీ చులకన.
* ఇంటివారు 'ఒసే' అంటే బయటివారు 'తసే' అంటారు.
* ఇంటివారు వేలు చూపితే బయటివారు కాలుచూపుతారు.

No comments:

Post a Comment