Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 2

* ఎండు పండు లేకుండా ఉంటుందా?
* ఎండు మామిడి టెంకలు ఒళ్ళో పెట్టుకొని, ఎవరి త్రాడు తెంప వచ్చావోయి వీరన్నా అన్నదిట.
* ఎంత ఉన్నవాడైనా ఒక్కసారి ఒకే ముద్ద మింగగలడు.
* ఎంత ఉప్పుతింటే అంత దాహం.
* ఎంత కఱవు ఐనా పులి పూరీ మేస్తుందా?
* ఎంత చెట్టు కంత గాలి.
* ఎంత చెట్టు కంత పాటు.
* ఎంత చేసినా ఎడమచేతి కడియం కుద(దు)వే.
* ఎంత దరిగిన మిరియాలు జొన్నలు సరిపోవే?
* ఎంత తోండమున్నా దోమ ఏనుగు కాదు.
* ఎంత దయో దాసులపై అన్నట్లు.
* ఎంత నేరిచినా ఎంతజూచినా ఎంతవారలైన కాంత దాసులే.
* ఎంత పండినా కూటికే, ఎంత ఉండినా కాటికే.
* ఎంతపెద్ద చెట్టు ఎక్కినా ముడ్డి నేలనే చూస్తుంది.
* ఎంత పెద్దవారికైనా ముడ్డి పీతికంపే.
* ఎంత పెరిగినా గొఱ్ఱెకు బెత్తెడే తోక.
* ఎంత పొద్దుండగా లేచినా తుమ్మగుంటవద్దనే తెల్లారుతుంది.
* ఎంత పొద్దుకాడ లేచినా చింతగుంటపాలెం దగ్గరే తెల్లవారుతుంది.
* ఎంత పోట్లాడుకున్నా కల్లుదుకాణం కాడ ఒక్కటే.
* ఎంత ప్రాప్తో అంత ఫలం
* ఎంతమంచి కత్తి అయినా తన పిడిని గంటు చేయదు.
* ఎంత మంచి గొల్లకయినా వేపకాయంత వెఱ్ఱిలేకపోలేదు.
* ఎంత మంచి పంది అయినా అమేధ్యం (అశుద్ధం) తినక మానదు.
* ఎంతయ్యా ఇవ్వాళ బేరంలో లాభంమంటే, ఎఱిగినవాడు వెఱ్ఱివాడు రాలేదన్నాడుట.
* ఎంతలావు మొగుడైనా ఆడదానికి లోకువే.
* ఎంతవారలైనా కాంత దాసులే.
* ఎంత వెలుగుకు అంత చీకటి.
* ఎంత సంపదో అంత ఆపద.
* ఎంత స్వామి ప్రసాదమైతే మాత్రం, ఇంత చేదా?
* ఎందరో మహానుభావులు (వ్యంగ్యంగా కూడ ప్రయోగం).

No comments:

Post a Comment