Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 3

* ఎందరో మహానుభావులు, వారందరికి వందన మన్నారు.
* ఎందుకు ఏడుస్తావురా పిల్లవాడా? అంటే, ఎల్లుండి మా అమ్మ కొడుతుంది అన్నాడుట.
* ఎందుకు పుట్టావు ఏకా అంటే, ఎదుటివాళ్ళని వెక్కిరించటానికే అన్నదిట.
* ఎందుకు పుట్టావు వక్రమా అంటే సక్రమమైన వాళ్ళను వెక్కిరించను అన్నదిట.
* ఎందునైనా ముఖరాసి (జన్మరాశి) బాగుండాలన్నారు.
* ఎందుకొచ్చినావే ఎల్లమ్మా అంటే, అందుకు కాదులే అగ్గికొచ్చాను అన్నదిట.
* ఎందులో పుట్టిన పురుగు అందులోనే చస్తుంది (బ్రతుకుతుంది).
* ఎందులో పెట్టినా ఎడారే.
* ఎక్కగా ఎక్కగా పొడవు.
* ఎక్కడ ఉన్నావే కంబళీ అంటే, వేసిన చోటనే గొంగళీ అన్నదిట.
* ఎక్కడ కడితేనేమి, మన మందలో ఈనితే చాలు.
* ఎక్కడకొట్టినా కుక్క కాలు కుంటుతుంది.
* ఎక్కడైనా బావ అనుకానీ వంగతోటలో (కాడ) బావా అనకు.
* ఎక్కడమేసినా పేడ మన పెరట్లో వేస్తే చాలు.
* ఎక్కడ నుంచి వస్తున్నావోయ్ నత్తాయనా అంటే, రె రెడ్డొరించిను నుంచోయ్ చోయ్ న నంగాయనా అన్నాడట.
* ఎక్కడమేసినా మనింట్లో పాలిస్తే చాలు.
* ఎక్కడా దొరక్కపోతే అక్కమొగుడే గతి.
* ఎక్కడాలేకపోతే అక్క మొగుడే దిక్కు.
* ఎక్కడీకిపోతావు విధవమ్మా అంటే, వెంటవస్తాను పదవమ్మా అన్నదిట.
* ఎక్కడికిపోయినా ఏలినాటి శని తప్పదు.
* ఎక్కడీకిపోయినా కర్మం ఎదురుగుండానే వస్తుంది.
* ఎక్కడిదక్కడె ఉంచి ఎల్లమ్మ ఇల్లలికి నట్లు.
* ఎక్కడిదిరా ఈ పెత్తనం? అంటే, మూలనుంటే నెత్తిన వేసుకున్నా అన్నాడట.
* ఎక్కడి నీరూ పల్లానికే చేరుతుంది (పారుతుంది).
* ఎక్కమంటే ఎద్దుకు కోపం, దిగమంటే కుంటికి కోపం.
* ఎక్కితే గిఱ్ఱపు రౌతు, దిగితే కాలిబంటు.
* ఎక్కి కాయపట్టిచూసి, దిగివచ్చి రాళ్ళు రువ్వినట్లు.
* ఎక్కిరించబోయి వెలకిత్తలా (వెల్లికింతలా) పడ్డట్లు.
* ఎక్కువగా తిన్న పొట్ట, ఏకులు పెట్టిన బుట్టి చిరుగవు.
* ఎక్కువ తెలివి ఏడ్పుల కారణం, తక్కువ తెలివి తన్నుల కారణం.

No comments:

Post a Comment