Saturday, June 15, 2019

అ - ఆ >>>> 4

* అంకపొంకాలు లేనిది శివలింగం
* అంకెకు రాని ఆలిని ఆరుగురు బిడ్డల తల్లయినా విడవాలి
* అంకెకు రాని ఆలి - కీలెడలిన కాలు
* అంగటి వీధిలో అబ్బా అంటే, ఎవరికి పుట్టావురా కొడకా అన్నట్లు
* అంగట్లో అన్నీ వున్నాయి అల్లుని నోట్లో శని
* అంగట్లో అరువు - తల మీద బరువు
* అంగట్లో అష్ట భాగ్యం - అల్లుని నోట్లో అష్ట దరిద్రం
* అంగట్లో ఎక్కువైతే ముంగిట్లో కొస్తుంది
* అంగడి అమ్మి గొంగళి కొన్నట్లు
* అంగడి బియ్యం - తంగేటి కట్టెలు
* అంగరక్ష లెన్నివున్నా శ్రీరామరక్ష వుండాలి
* అంగిట బెల్లం - ఆత్మలో విషం
* అంగిట విషం - మున్నాలిక తియ్యదనం
* అంచుడాబేగానీ పంచడాబు లేదన్నట్లు
* అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు
* అంటుకోను ఆముదం లేకుంటే మీసాలకు సంపెంగ నూనెట
* అంటే ఆరడి - అనకుంటే అలుసు
* అండలుంటే కొండలు దాటవచ్చు
* అండలేని వూళ్ళో వుండ దోషం - ఆశలేని పుట్టింట అడగ దోషం
* అండ వున్నవానిదే అందలం
* అంత వురిమీ యింతేనా కురిసేది!
* అంతకు తగిన గంత, గంతకు తగిన బొంత
* అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు
* అంత నీతే వుంటే ఇంత సంతెందుకు?
* అంత పెద్ద పుస్తకం చంకలో వుంది పంచాంగం చెప్పలేవా?
* అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు
* అంతా బాపలే, మరి కోడిపెట్ట ఏమైనట్లు?
* అంతా మావాళ్ళేగానీ అన్నానికి రమ్మనే వాళ్ళు లేరు
* అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు
* అందం చందం నావంతు - ముద్దూ మురిపెం నీవంతు అన్నదట

No comments:

Post a Comment