Saturday, June 15, 2019

ఉ - ఊ >>>> 3

* ఉత్తరాన మబ్బు ఏలితే ఊరకే పోదు.
* ఉత్తరాయణం వచ్చింది ఉరిపెట్టుకో అన్నట్లు.
* ఉద్దత్తులమధ్య పేదలకుంద తరమే?
* ఉద్దర(అప్పు, ఊరికే వస్తే ) అయితే ఊళ్ళుకొంటరు. నగదు ఐతే నశ్యం కూడా కొనరు.
* ఉద్దర ఐతే నాకిద్దరు అన్నాడుట.
* ఉద్దర సొమ్ము దుడ్డుకు పంచేరు.
* ఉద్దరసొమ్ము నిద్దుర చేటు.
* ఉద్ధరిణెడు నీళు ఉంగరపు వేలు దర్భ.
* ఉద్యోగం గట్టిపడుతుంది, ఉన్న పుస్తె తేవే!
* ఉద్యోగం పురుష లక్షణం, అదిపోతే అవలక్షణం.
* ఉద్యోగం పురుష లక్షణం, గొడ్డలితేరా నిట్రాడు తెగనరుకుదాం.
* ఉద్యోగికి ఒక ఊరులేదు, ముష్టివానికి ఒక ఇల్లు లేదు.
* ఉద్యోగికి దూరభూమిలేదు.
* ఉన్న అమ్మ గాదె (పాతర) తీసేప్పటికి లేని అమ్మ ప్రాణం లేచిపోయింది.
* ఉన్న ఊరిలో ముష్టి అయినా పుట్టదు.
* ఉన్న ఊరువాడికి వెలుతురు భయం, పొరుగూరివాడికి నీడ(ళ్ల) భయం.
* ఉన్న ఊరు కన్నతల్లి వంటిది.
* ఉన్నది అంతా ఉండగా, ఊపాధ్యాయులవారి భార్య సమర్తాడిందిట.
* ఉన్నది ఉండగా, ఉయ్యూరిమీద మేడూరు వచ్చిపడ్డట్టు.
* ఉన్నది ఉలవకట్టె, పోయింది పొలికట్టె.
* ఉన్నది ఒక్క కూతురు, ఊరంతా అల్లుళ్ళు.
* ఉన్నది ఒక్క బిడ్డ, ఊరంతా మొగుళ్ళు.
* ఉన్న ఒక్కమెతుకు కాస్తా గంజిలో పోయినట్లు.
* ఉన్నదున్నట్లు చెప్పమంటె, తిన్నదేమి చేసేనూ- అన్నదట లంజ.
* ఉన్నదిపోదు లేనిది రాదు.
* ఉన్నదిపోయే ఉంచుకున్నదీ పోయె.
* ఉన్ననాడు ఉగాది పండుగ, లేని నాడు కాముని పండుగ.
* ఉన్నమాట అంటే, ఉండే ఊరు అచ్చిరాదు.
* ఉన్న మాట అంటే ఉలుకెక్కువ.
* ఉన్న మాట అంటే ఊరికే చేటు.

No comments:

Post a Comment