Saturday, June 15, 2019

ఉ - ఊ >>>> 4

* ఉన్నమ్మ ఉన్నమ్మకే పెట్టే, లేనమ్మా ఉన్నమ్మకే పెట్టె.
* ఉన్నవాడు ఉన్నవాడికే పెట్టును, లేనివాడూ ఉన్నవానికే పెట్తును.
* ఉన్నవాడు ఊరికి పెద్ద, చచ్చినవాడు కాటికి పెద్ద.
* ఉన్నవాడు ఖర్చు పెట్తకపోతే అంటారు, లేనివాడు ఖర్చు పెడితే అంటారు.
* ఉన్న శాంతం ఊడ్చుకుపోయింది గానీ కోపమే లేదు.
* ఉపకారం అంటే ఊళ్ళోంచి లేచిపోయినట్లు.
* ఉపకారానికి పోతే అపకారం వెంటవచ్చినట్లు.
* ఉపకారపు మొగుడు వుంటే, మనువిచ్చాడుట.
* ఉపనయనము నాటిమాట ఉన్నది సుమతి. (భవతీ భిక్షాందేహి అనుట).
* ఉపాయం లేని వాడు, ఉపవాసంతో చచ్చాడు.
* ఉపాయం లేని వాణ్ణి ఊళ్ళోనుంచి వెళ్ళకొట్టమన్నారు.
* ఉపాయం చెప్పవయ్యా అంటే, ఉరిత్రాడు తెచ్చుకోమన్నాడట.
* ఉపాయం ఉన్నవాడు ఊరిమీద (పడి) బ్రతుకుతాడు.
* ఉపాయం ఎరుగని దాసరయ్యా, ఊళ్ళ ఉపాసం ఉండవయ్య.
* ఉపాయవంతుడు ఊరికి ఉరవడి.
* ఉప్పరసన్యాసం ఉభయ భ్రష్టత్వం.
* ఉప్పు ఊరగాయ కాదు.
* ఉప్పుకు నిప్పువలే.
* ఉప్పుతిని ఉపతాపమందనేల?
* ఉప్పుతిన్న కోడే ఊరిపోయింది, పప్పు తిన్న కోడే పాలిపోయింది.
* ఉప్పు తిన్న ప్రాణం ఊరుకోదు.
* ఉప్పుతిన్న వాడు నీరు తాగక తప్పదు.
* ఉప్పుతో తొమ్మిది పప్పుతో పది.
* ఉప్పు పులుసు కారము తినే శరీరానికి ఊపిరి ఉన్నంతవరకే ఉంటుంది కామము.
* ఉప్పు మిరపకాయ ఊరికే రాగా ఆలినికొట్ట చేతులు తీటా?
* ఉప్పు ముల్లెను నీటిలో ముంచినట్లు.
* ఉప్పులేదు కారంలేదు, అమ్మతోడు! కమ్మగుంది.
* ఉప్పులేని పప్పు, ఊరగాయలేని సద్ది.
* ఉప్పువాడు ఏడిసాడు, పప్పువాడూ ఏడిసాడు, బోండాపు కాయలవాడు పొర్లి పొర్లి ఏడిసాడు.(ఎవరిసొమ్ము వారికి ఎక్కువ అనుట).
* ఉప్పువాడూ చెడె, పప్పువాడు చెడె, తామలపాకులవాడు తమాము చెడె.

No comments:

Post a Comment