* ఒక్కక్క చినుకే వాన అవుతుంది.
* ఒక్కక్క రాయి తీస్తుంటే కొండైనా తరుగుతుంది.
* ఒగిచేవారే గానీ ఓదార్చే వారుండరు.
* ఒజ్జలే కంకులతో కాలం గడుపుతూ ఉంటే శిశ్యులకు ఊచబియ్యమా?
* ఒట్టుపోయి గట్టెక్కే, తానుపోయి చెట్టెక్కే.
* ఒడిలో బెట్టుదునా? బడిలో బెట్టుదునా? అన్నట్లు.
* ఒడుపుచేత కడుపు చేసికొన్నట్లు. (ఒడుపు=తొందరపాటు, లాఘవము).
* ఒడ్డున నిలబడే సముద్రాన్ని పొగడాల.
* ఒత్తిపలకవే వసనాభ్పిల్లి అంటే మ్రావ్ మ్రావ్ అన్నదిట.
* ఒత్తు పొత్తును చెరచును.
* ఒరపు కోరుస్తారుగానీ, తడుపుకోర్వరు.
* ఒల్లని మగనికి తలంబ్రాలు పోసినట్లు.
* ఒల్లని వనికి పెరుగులో రాయి.
* ఒల్లీఒల్లని చుట్టం వచ్చాడు, ఉడుకే ఉలవపప్పా ఉగాదిదాకా.
* ఒళ్ళంతా తడిసినవెనుక ఓపలేనివారికైనా చలిలేదు.
* ఒళ్ళెరుగని శివము, మనసెరుగని కల్ల ఉందా?
* ఒళ్ళుబలిసిన గంగానమ్మ పేడకుడుములు అడిగిందట.
* ఒళ్ళు వంగనమ్మ కాలి మట్టెలకు కందిపోయిందట.
* ఒళ్ళువంగని వాడు దొంగలతో కలిసినాడట.
* ఒళ్ళో గింజలు ఉన్నా, వద్ద భార్య ఉన్నా ఊరుకో బుద్ధి కాదు.
* ఓంకారములేని మంత్రం, అదికారములేని ప్రఙ్ఞ
* ఓ కన్ను పువ్వుకన్ను ఇంకోకన్ను కాయకన్ను.
* ఓ ' కు ఎన్ని వంకరలో తెలియని వానికే వయ్యారం.
* ఓనామాలు రానివాడు వడ్డీలు (వడ్లు) గుణించినట్లు.
* ఓగల ముసలిది దొంగనుకట్టుకు ఏడ్చిందట.
* ఓగు కడుపున వజ్రం పుట్టినట్లు.
* ఓగును ఓగే మెచ్చును, అఙ్ఙానిని అఙ్ఞానే మెచ్చును.
* ఓటికుండలో నీరుపోసినట్లు.
* ఓటికుండలోన ఉండునా నీరంబు.
* ఓటి తెప్పను నమ్ముకొని నీట్లో దిగినట్లు.

No comments:
Post a Comment