Saturday, June 15, 2019

ఒ - ఓ >>>> 4

* ఓడేక్కేదాకా ఓడమల్లయ్య, ఓడ దిగగానే బోడిమల్లయ్య.
* ఓడలు బండ్లవచ్చు, బండ్లు ఓడలవొచ్చు.
* ఓడిన గుఱ్ఱం జీనుపై సొడ్డుబెట్టిందట.
* ఓడుఓడు అంటే, కంచమంతా ఓడనట్లు.
* ఓదార్చే కొద్ది ఏడ్చే బిడ్డవంటివి కష్టాలు.
* ఓనామాలు చదివారేకానీ ఆనవాలు చూపించలేరు.
* ఓనామాలే ఋక్కులు, ఒకరెండే లెక్కలు.
* ఓవనివాడు కోరనిది, ఒల్లనివాడు ఆడనిది లేదు.
* ఓవనివానికి ఒద్దన్నవారే తల్లితండ్రులు.
* ఓవలేని అత్త, వంగలేని కోడలు.
* ఓబీ! ఓబీ! నీవు వడ్లుదంచు నేను పక్కలెగరేస్తా అన్నట్లు.
* ఓరీ రజక చక్రవర్తీ అంటే, ఇంత పెద్ద పేరు మాకెందుకు దొరా! మీకే ఉండనీయండి అన్నడట.
* ఓర్చలేనమ్మ ఒడిని నిప్పులు కట్టుకుంటే, ఒడీ, దడీ కాలిందట.
* ఓర్చలేని రెడ్డి ఉండీ చెఱచెను, చచ్చీ చెఱచెను.
* ఓలి ఇచ్చిన మొగుడికంటే, కూలి ఇచ్చిన మొగుడెక్కువ (ఓలి=కన్యాశుల్కం).
* ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే, దొంతి కుండలన్ని పగులకొట్టినట్లు.
* ఓలి తక్కువని గుడ్డిదాన్ని పెళ్ళాడితే, నెలకు ముఫై కుండలు నీళ్ళాడుతాయి.
* ఔననటానికి కాదనటానికి అత్తకధికారం గానీ, కోడలికేముంది?
* ఔను-కాదు అనే మాటలెంత చిన్నవో, వాటిని అనటం అంత కష్టం.
* ఔషధం కానిది అవనిలో లేదు.
* ఔషధానికి అపధ్యానికి చెల్లు, రోగం పైపెచ్చు.

No comments:

Post a Comment