Saturday, June 15, 2019

క - ఖ >>>> 3

* కంసాలి పెళ్ళికి ఇల్లంతా పొయ్యిలే.
* కంసాలి బఱ్ఱె నమ్ముతున్నాడు, లోపల లక్క లేకుండా చూడరా అన్నాడట.
* కంసాలి మాయ కంసాలికి గానీ తెలియదు.
* కంసాలి లేకుండా చూసి కధ చెప్పమన్నారు.
* కంసాలి వద్దనైనా ఉండాలి, కుంపటిలోనైనా ఉండాలి (తగ్గిన బంగారం).
* కంసాలి వారు కాలానికి పెళ్ళికొడుకులు, కరువుకు కాటిపీనుగలు.
* క్కదింటే (కక్కేదాకా తింటే) గారెలు చేదంట.
* క్కిన కుక్కవద్దకు, కన్న కుక్కవద్దకు కానివాణ్ణయినా పంపరాదు.
* క్కిన కూటికి ఆశించినట్లు.
* క్కిన బిడ్డ దక్కుతుంది.
* క్కూర్తి మొగుడు కడుపునొప్పి బాధ ఎరుగడు.
* క్కూర్తి పడ్డా కడుపు నిండాల.
* క్కూర్తి పడ్డా సుఖం దక్కాలి.
* చ్చితానికి కాసులు, ఉచితానికి ఊళ్ళు.
* టకట ఉన్న ఇంట కలిమి ఉండదు.
* టకటా అనే ఇంట కట్ట బట్టా, తిన తిండి ఉండవు.
* టికవానికి కత్తి అందించినట్లు.
* ట్టకింద కఱ్ఱలాడితే, మాలదాని పిఱ్ఱ లాడుతాయి.
* ట్టనిలువని చెరువు గడియలోపలనిండు, బ్రతుకలేని బిడ్డ బారెడుండు.
* కట్టిన ఇంటికి వంకరలు (వణుకులు) చెప్పేవారు వెయ్యిమంది.
* కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి.
* కట్టిన ఇంటికి కణుకులు మెండు.
* కట్టినవానికొక ఇల్లైతే, అద్దెకున్నవాని కన్నీ ఇండ్లే.
* కట్టిన వారు ఒకరైతే, కాపురం చేసేది ఇంకొకరు.
* కట్టివేసిన బఱ్ఱెకు కావలి కాచినట్లు.
* కట్టుకున్న ఆపే, పెట్టుకున్న ఆమే ఉండగా, ఎదురుపడ్డ ఆపె ఎండిపోయిందట.
* కట్టుకున్న పెండ్లామే చేయవలె, కన్న తల్లే చెయవలె.
* కట్టుకున్న మొగుడు, పెట్టెనున్న నగలు.
* కట్టుకున్న వాడికంటే, పెట్టుకున్న వాడిమీదనే ప్రేమ.
* కట్టుచీర లేనినాడు పట్టుచీర బయటకు వస్తుంది.

No comments:

Post a Comment