Saturday, June 15, 2019

క - ఖ >>>> 4

* కట్టులేని ఊరు, గట్టులేని చెరువు.
* కట్టె గొడ్డలిలో దూరి, కులానికి చేటు దెచ్చు.
* కట్టె దేవుని దగ్గర, కన్ను లంజ పైన.
* కట్టెలు ఆటని ఇంట్లో కనకము కూడా ఆటదు (ఆట= ఆగు, నిలుచు).
* కట్టెలు తేరా తిమ్మా అంటే, కడుపునొస్తదే అమ్మా అన్నట్లు.
* కట్టెలోన నగ్ని పుట్టిన విధమున.
* కట్టె వంక పొయ్యి తీరుస్తుంది.
* కట్టేయస్వాహా, కంపాయస్వాహా, నీకూ నాకూ చెరి సగాయస్వాహా.
* కట్టెలేదు, కంపలేదు, కాచీపోయా నీళ్ళూ లేవు, పదవోయి అల్లుడా బావి గట్టుకు.
* కట్టేవాడు అవివేకి, ఇంట్లో బాడిగకు ఉండేవాడు వివేకి.
* కట్టేవి కాషాయాలు దూరేవు దొమ్మరి గుడిశలు.
* కఠినచిత్తు మనసు కరిగింపగారాదు.
* కఠినమైనా కన్నతల్లి, వట్టిదైనా వరికూడు.
* కడగా ఉన్న గొడ్డలిని కాలిమీద వేసుకున్నట్లు.
* కడాగా పోయే శనేశ్వరుడా మా ఇంటిదాకా వచ్చి మరీ పొమ్మన్నట్టు.
* కడచి బ్రతికిన దెవ్వరు?
* కడచి బ్రతికినామని గంతులు వేయరాదు.
* కడచినదానికి వగచిన లాభమేమి?
* కడజాతికానీ, కాసులు కలవాడే రాజు.
* కడపటి మడివాని కటారిపోటు కంటే, ఎదుటి మడివాని ఏకుపోటు మేలు.
* కడలిలో ఉప్పుకు, అడవిలో ఉసిరికకు లోకువా?
* కడవంత గుమ్మడికాయైనా, కత్తిపీటకు లోకువే.
* కడవ వెళ్ళి కడముంతలో దూరినట్లు.
* కడివెడు పాలకు ఒక్క మజ్జిగ బొట్టు.
* కడ వేరు మిగిలినా గరిక చిగర్చక మానదు.
* కడి అంటే నోరు తెరచి, కళ్ళెమంటే మూసినట్లు.
* కడి గండం కాచును, వత్తి మిత్తి కాచును.
* కడిగిన మొగముంటే ఎందుకైనా మంచిది.
* కడియాలవారు వచ్చారు అంటే కడియాలు కావాలా అన్నడుట.
* కడుగు తాగినవాని కడుపేమి నిండురా? (కడుగు=కుడితి, బియ్యం కడిగిన నీరు).

No comments:

Post a Comment