* ఎక్కువయిన సొమ్ము బ్రహ్మలకిత్తునా? బట్లకిత్తునా?
* ఎగతాళి అంటే ఏడువ వస్తాడు, కోడిగ మంటే కొట్టవస్తాడు.
* ఎగతాళి చేసేవారిముందు జారిపడినట్లు.
* ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య.
* ఎగవేసే వాడి ఇల్లెక్కడా? అంటే ఊరికడపట అన్నట్లు.
* ఎగిరిన దూది గాలిలో ఎంతోసేపు ఉండదు.
* ఎగిరెగిరి దంచినా అంతేకూలి, ఎగరక దంచినా అంతేకూలి.
* ఎగిరే ఎద్దే గంత మోసేది.
* ఎగరబోయి బోర్లపడి, ఊరు అచ్చివచ్చిందికాదు అన్నాడట.
* ఎగ్గును అనక, వినక, కనక కవి కావ్యం వ్రాయలేడు.
* ఎచ్చులకు (డంబములకు) ఏటపోతును కోస్తే, ఒళ్ళంతా బొచ్చు అయ్యింది.
* ఎచ్చులకు ఏలేశ్వరంపోతే పక్కతోలు కుక్కలెత్తుకు పోయినవి.
* ఎచ్చులకు వేటపాలెంపోతే, తన్ని తలగుడ్ద తీసుకున్నారట..
* ఎచ్చులకు ఏమారం పోతే, తన్ని తలగుడ్ద పెరుక్కున్నారుట.
* ఎట్లా (ఎట్లాంటి)చిరుబోణికైనా వేపకాయంత వెఱ్ఱి ఉంటుంది.
* ఎట్లా వచ్చిందో అట్లే పోతుంది, తేలికగా వచ్చింది తేలికగానే పోతుంది.
* ఏడదిడ్డమంటే, పెడదిడ్డ మన్నట్లు.
* ఎడపిల్ల ఏరాలితో సమానం.
* ఎడమచేత్తో చేసింది కుడిచేత్తో అనుభవించవలె.
* ఎడ్డెమంటే, తెడ్డెమన్నట్లు.
* ఎతలున్నమ్మకు కతలు రావు.
* ఎత్తివచ్చిన కాపురానికి ఏకాలూనినా ఒకటే.
* ఎత్తుకున్న చంకనుండదు, దించిన దిగువనుండదు. (బిడ్డ)
* ఎత్తుక తిన్నవాణ్ణి పొత్తులో పెట్టుకుంటే, అంతాతీసి బొంతలోపెట్టుకున్నాడుట.
* ఎత్తుకున్న బిడ్డ మొత్తుకున్నా దిగదు.
* ఎత్తుకొని తిన్న బోలె ఎదురుగా వస్తే, చంకనున్న బోలె సలాంచేసిందిట.
* ఎత్తుబడిన గొడ్డు పులికి జడుస్తుందా?
* ఎత్తుభారపు పెళ్ళికి ఏకాలుపెట్టినా ఒకతే. (ఎత్తుభారం=వ్యర్ధమైన, పనికి మాలిన).
* ఎత్తుభారం మొత్తుకోళ్ళు.
* ఎత్తుమరిగిన బిడ్డ, వెలుగుదాటే గొడ్డు ఏమిచేసినా వినవు.

No comments:
Post a Comment