Saturday, June 15, 2019

అ - ఆ >>>> 5

* అందం చందం లేని మొగుడు మంచం నిండా వున్నట్లు
* అందని ద్రాక్షపండ్లు పుల్లన
* అందముంటే సరా! అదృష్టముండొద్దూ!
* అందని మ్రానిపండ్లకు అఱ్ఱులు చాచినట్లు
* అందరి కాళ్ళకు మ్రొక్కినా అత్తగారింటికి పోకతప్పదు
* అందరికీ శకునం చెప్పే బల్లి తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు
* అందరికీ అన్నం పెట్టే వాడు రైతే
* అందరికీ నేను లోకువ నాకు నంబి లోకువ
* అందరినీ మెప్పించడం అలవి గాని పని
* అందరూ అందల మెక్కేవారే, మోసే వారెవరు?
* అందరూ ఒక ఎత్తు - అగస్త్యుడు ఒక్కడూ ఒక ఎత్తు
* అందరూ శ్రీవైష్ణవులే బుట్టెడు రొయ్యలు ఎగిరిపోయినాయ్‌
* అందానికి పెట్టిన సొమ్ము ఆపదకు అడ్డం వస్తుంది
* అందాల గంధాలు, అధరాల మధువులు కౌగిలింతల పాలన్నట్లు
* అందాల విందులు, అధరాల మధువులు నీకే అన్నదట
* అందాలు నావి - సంబరాలు నీవి అందిట
* అందితే జుట్టు అందకపోతే కాళ్ళు
* అందితే తియ్యన అందకుంటే పుల్లన
* అందీ అందని పరువాలు ఉసికొలిపే కాముని కవ్వింతలు
* అంధునికి అద్దం చూపినట్లు
* అంబటిలోకి ఉప్పే లేకుంటే పిండి వంటల మీదకు పోయిందట మనసు
* అంబలా అంటే ముఖాలే చెప్తాయి అన్నట్లు
* అంబలి త్రాగేవాడికి మీసాలెత్తే వాడొకడా?
* అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్లు
* "అ - ఆ" లు రావు గానీ అగ్రతాంబూలం కావాలట
* అకట వికటపు రాజుకు అవివేకపు ప్రధాని, చాదస్తపు పరివారము
* అక్క ఆరాటమే గానీ బావ బ్రతకడన్నట్లు
* అక్క కాపురం అడగక్కర లేదు - చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు
* అక్కచెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క వ్రాసినట్లు
* అక్క పగ, బావ మంచి
* అక్క మనదైతే బావ మన వాడవుతాడా?

No comments:

Post a Comment