Saturday, June 15, 2019

క - ఖ >>>> 5

* కడుగు త్రగిన కాకి కఱ్ఱని కూయదా?
* కడుపా కళ్లేపల్లి చెరువా?
* కడుపా కొల్లేరు మడుగా?
* కడుపా చెరువా?
* కడుపుకాలి ఏడుస్తుంటే, మనవర్తి ఏమిస్తావు అన్నదిట.
* కడుపుకు పెట్టిందే కన్నతల్లి.
* కడుపు కూటి కేడిస్తే, ఇంకొకత్తి కొప్పుపూల కేడ్చిందట.
* కడుపు చించుకుంటే పేగులు కాళ్ళమీద పడును.
* కడుపు చించుకున్నా గారడి విద్యే అన్నట్లు.
* కడుపు చేసినవాడే కాయము, పిప్పళ్ళు తెస్తాడు (కాయము=తినబెట్టే మందు).
* కడుపుతో ఉన్నమ్మ కనక మానదు, వండినమ్మ తినక మానదు.
* కడుపున పుట్టిన బిడ్ద- కొంగున కట్టిన రూక.
* కడుపు నిండితే కడవలు మోయు, లేకపోతే పగులవేయు.
* కడుపు నిండినవానికి గారెలు కనరు.
* కడుపు రాతిలోని కప్పకు కలుగదా?
* కడుపులో కాపాడినవాడు కాలాన కాపాడడా?
* కడుపులో తిప్పందే కక్కొస్తుందా?
* కడూపులో ఎట్లాఉంటే, కాపురమలా ఉంటుంది.
* కడుపులో చల్ల కదలకుండా.
* కడుపులో మంట కానరాని మంట.
* కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా?
* కడుపులో లేని ప్రేమ కావాలంటే వస్తుందా?
* కడుపు వస్తే కనే తీరవలెను.
* కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం.
* కతకు కాళ్ళు, ముంతకు చెవులు కల్పించినట్లు.
* కలతమారి మొగుడు కమ్మలు చేయిస్తే, అప్పులకూటి మొగుడు అమ్ముకతిన్నాడు.
* కత్తి తీసి కంపలో వేసి, ఏకుతీసి పొడుచుకుంటానన్నాడట.
* కత్తిపీటకు పళ్ళు పులుస్తాయా?
* కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు.
* కత్తిమీద సాము కడతేరబోదయా.

No comments:

Post a Comment