* ఇచ్చి తిరిగేది కోమటి, తీసుకొని తిప్పేది కంసాలి.
* ఇచ్చిత్రపు పచ్చి పులుసు, ఇస్తర మింగిందట.
* ఇచ్చిన నిష్టూరం కంటే ఇవ్వని నిష్టూరమే మేలు.
* ఇచ్చినమ్మ ఈగ, పుచ్చుకొన్నమ్మ పులి.
* ఇచ్చినవాడు కుక్క, (పిల్లను) చేసుకున్న వాడు చుక్క.
* ఇచ్చినవాడు తలమీద, ఇవ్వనివాడు నేలమీద.
* ఇచ్చినవాడు దాత, ఇవ్వనివాడు రోత.
* ఇచ్చినవాడే నచ్చినవాడు, చచ్చినవాడే అచ్చినవాడు.
* ఇచ్చిననాడు ఇంత పీనుగ వెళ్ళినట్లు, పుచ్చుకున్ననాడు పుత్రకామేష్టి.
* ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటే వ్యవహారం, వచ్చిపోతూ ఉంటే బాంధవ్యం.
* ఇచ్చే గొడ్డునే పితికేది.
* ఇచ్చేటప్పుడు కాముని పండుగ, పుచ్చుకునేప్పుడు దీపావళి పండుగ.(అప్పు)
* ఇచ్చేవాడు తీసుకునే వాడికి లోకువ.
* ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు.
* ఇచ్చేవానికి పత్రమూ వద్దు, చచ్చేవానికి మందు వద్దు.
* ఇటిటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు.
* ఇటుకులాడికి రవిక పెడితే, కంపకు పెట్టి చింపుకున్నదట.
* ఇటువేస్తే హనుమంతుడు, అటువేస్తే వీరభద్రుడు.
* ఇట్లైతే వైద్య కట్నం, అట్లైతే వైతరణీ గోదానం.
* ఇడిసిన గుద్ద వీధికి పెద్ద.
* ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా.
* ఇత్తడి పుత్తడికాదు, తొత్తు దొరసానీ కాదు.
* ఇది ఇట్లా, మొగుడట్లా, సేద్యగాడికి సంకటెట్లా?
* ఇదిగో సున్నం అంటే, అదిగో వెన్న అంటారు.
* ఇదిగో పసుపు, అదిగో ముసుగు. ( అంత తొందరగా ముండ మోసినదనటం).
* ఇదిగో పులి అంటే, అదిగో తోక అనట్లు.
* ఇదిగో పాము అంటే అదిగో పడగ అన్నట్లు.
* ఇద్దరు ఒక చోట ఏకాంతమాడగా మధ్యన చేరేవాడు వట్టి వెధవ.
* ఇద్దఱుకూడితే, ఇంగలం లేకుండానే మండుతుంది.
* ఇద్దఱు దెబ్బలాడితే మూడవవాడికి లాభం.

No comments:
Post a Comment