Saturday, June 15, 2019

ఇ - ఈ >>>> 5

* ఇద్దరు పెళ్ళాల మొగుడు ఇఱుకునపడి చచ్చాడుట.
* ఇద్దరు పెద్ద మనుషులు ఎదురుపడితే మూడుదారులు, ఒకపెద్దమనిషి ఇంకొక మూర్ఖుడు ఎదురుపడితే రెండుదార్లు, ఇద్దరూ మూర్ఖులైతే ఒకేదారి.
* ఇనుపకుండ పగిలితే అతకవచ్చునుగాని, మట్టికుంద పగిలితే అతకలేము.
* ఇనప గుగ్గిళ్ళుగానీ. మినప గుగ్గిళ్ళు కావు.
* ఇనుము కరగేచోట ఈగలకేమి పని?
* ఇముము విరిగితే అతక వచ్చును గాని, మనసు విరిగితే అతకలేము.
* ఇన్ని కంతులు కోశాను గానీ, నా కంతి అంత నొప్పి మరేదీ లేదు.
* ఇప్పపూలకు వాసన వెతుకవలెల్నా?
* ఇయ్యగల ఇప్పించగల అయ్యలకేగాని, మూతిమీసం అన్యులకేల?
* ఇరుగింటమ్మా! ఇరుగింటమ్మ! మా ఇంటాయన గోడు చూడండమ్మా ! అన్నట్లు.
* ఇరుగు ఇంగలం, పొరుగు మంగలం.
* ఇరుగు గుడ్డి, పొరుగు గుడ్డి, ఇంటి ఇల్లాలు గుడ్డి.
* ఇరుగును చూసి పొరుగు వాతపెట్టుకున్నట్లు.
* ఇరుగూరి వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం ఒక్కటే.
* ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి బండీఐనా పారదు. (లంచం లేక పని కాదు అనుట).
* ఇఱుకులో సరుకు దించినట్లు.
* ఇఱుకులో సరుకు మంత్రం.
* ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు, కొమ్ములబఱ్ఱె కొట్టానికి చేటు.
* ఇల్లా నారాయణమ్మా అంటె, వెళ్ళు గోవిందా అన్నట్టు.
* ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.
* ఇల్లలుకగానే పండుగౌతుందా?
* ఇల్లాలా ఇల్లాలా మగలెందరే అంటే, తోలాటకాయతో తొంభైమంది అన్నదిట.
* ఇల్లాలి గుడ్డ మల్లిని చీకే, లంజ గుడ్డ బండను చీకే.
* ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు.
* ఇల్లాలు లేని ఇల్లు భూతాలకు నెలవు.
* ఇల్లాలి శుచి ఇల్లు చూడగానే తెలుస్తుంది.
* ఇల్లిటపుటల్లుడు ఇల్లెల్లపాదికి మొగుడు.
* ఇల్లు ఇచ్చినవానికి, మజ్జిగ పోసిన వానికి మంచి లేదు.
* ఇల్లు ఇరకటం, ఆలు మరకటం.
* ఇల్లు ఈగల పాలు దొడ్డి దోమల పాలు.

No comments:

Post a Comment