Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 5

* ఎత్తువారి బిడ్డ. (ఎవరిచంకనున్న వారిమాట వినును).
* ఎత్తెత్తి అడుగు వేస్తే పుల్లాకు మీద పడిందిట.
* ఎత్తెత్తిపోసినా ఇత్తడి బంగారమగునే?
* ఎత్తేవాడుంటే ఏకులబుట్టా బరువే.
* ఎదలో కత్తెర నాలుకలో బెల్లం.
* ఎదిగినదానిని వెంటేసుకు తిరిగినట్లు.
* ఎదుట అన్నది మాటా, ఎదాన్న పెట్టినది వాత.
* ఎదుట ఉన్నవాడు పెండ్లికొడుకు.
* ఎదుట బ్రాహ్మడు లేకపోతే వెయ్యి యఙ్ఞాలు చెయ్యవచ్చు.
* ఎదుట లేకుంటే ఎదలో ఉండదు.
* ఎదురింటి పొయ్యిమండితే, తన పొయ్యిలో నీళ్ళుపోసుకొన్నట్లు.
* ఎదుటివారి సొమ్ము ఎల్లవారికీ తీపు.
* ఎదురుగుండా అద్దముంటే ఎక్కిరించుకో బుద్దవుతుంది.
* ఎదురు తిరిగిన కుక్కను ఏదీ కరువలేదు.
* ఎదురు తిరిగిన కుక్కా ఏదుపంది ఒకటే.
* ఎదురుపడినవాడే నా మొగుడన్నట్లు.
* ఎదురుపెట్టి కుదురు కొట్టించుకొన్నట్లు.
* ఎదురుపెట్టి చదరంగ మాడినట్లు.
* ఎద్దు అంత కుప్పయితే ఏడు పుట్ల చోళ్ళు (సజ్జలు, రాగులు).
* ఎద్దు అడుగులో ఏడు గింజలుపడితే పైరు పలుచన.
* ఎద్దు (దున్న) ఈనిందంటే గాటా కట్టేయమన్నట్లు.
* ఎద్దు ఉన్నవాడికి బుద్ది ఉండదు, బుద్ది ఉన్నవాడికి ఎద్దు ఉండదు.
* ఎద్దు ఎండకులాగా, దున్నపోదు నీడకు లాగా.
* ఎద్దునెక్కున తీరుకాదు, సద్ది తిన్న నోరు కాదు.
* ఎద్దునెక్కున వాడే లింగడు, గద్దెనెక్కిన వాడే రంగడు.
* ఎద్దు ఏమెరుగురా అటుకుల రుచి, గాడిదేమెరుగురా గంధపు పొడి వాసన.
* ఎద్దుకాలిలో ముల్లంత లేకపోయినా, ఏడూళ్ళ పెత్తనానికి తక్కువ లేదు.
* ఎద్దుకు ఎనుబోతుకు లంకె వేసినట్లు.
* ఎద్దుకు కొబ్బరికాయ ఇస్తే ఏమి చేస్తుంది?
* ఎద్దుకు చొప్పవేసి ఆవుని పాలివ్వ మన్నట్లు.

No comments:

Post a Comment