Saturday, June 15, 2019

అ - ఆ >>>> 6

* అక్క మొగుడు కుక్క
* అక్కర వున్నంతవరకూ ఆదినారాయణ - అక్కఱ తీరిన తర్వాత గూదనారాయణ
* అక్కరకురాని చుట్ట మెందుకు?
* అక్కరకు వచ్చినవాడే మనవాడు
* అక్కర తీరితే అల్లుడు అశుద్ధంతో సమానమన్నట్లు
* అక్కరకు రానిది అవనిలో లేదు
* అగడ్తలో పడ్డ కప్పకు అదే వైకుంఠం
* అగసాలిని, వెలయాలిని నమ్మరాదు
* అగసాలి పొందు, వెలమల చెలిమి నమ్మరాదు
* అగ్గి చూపితే వెన్న అడక్కుండా కరుగుతుంది
* అగ్గిమీద గుగ్గిలం లాగా
* అగ్గువ అయితే అంగడికి వస్తుంది
* అగ్గువ కొననీయదు ప్రియం అమ్మనీయదు
* అగ్నికి వాయువు తోడైనట్లు
* అగ్నిచెంత వెన్న ఎంత తడవాగో ఆడవారి కోపము అంత తడవాగు
* అగ్నిదేవుడు చలికాలంలో చిన్నవాడు ఎండాకాలంలో ఎదిగినవాడు
* అగ్నిలో ఆజ్యం పోసినట్లు
* అగ్నిలో మిడత పడ్డట్లు
* అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం ఉంచరాదు
* అగ్రహారం పోతే పోయింది గానీ చట్టం మొత్తం తెలిసింది
* అచ్చట్లు - ముచ్చట్లు - ఎదనిండా వెన్నెల్లు అన్నట్టు
* అచ్చట్లు, ముచ్చట్లు దుప్పట్ల ముసుగులో అన్నదట
* అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చమ్మ శోభనం అన్నట్లు
* అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు
* అచ్చివచ్చే కాలానికి నడిచివచ్చే కొడుకు
* అచ్చు పోసిన ఆఁబోతువలె
* అజీర్ణానికి లంఖణం మందు
* అటైతే కందిపప్పు - యిటైతే పెసరపప్పు
* అటైతే వైద్యకట్నం - యిటైతే వైతరిణీ గోదానం
* అట్టే చూస్తే అయ్యవారు కోతిలా కనబడతారు
* అట్లు వండినమ్మకు ఆరుగురు అమర్చాలి
* అట్లు వండే అత్తకు అరవైఆరు ఎత్తులు పెట్టినట్లు
* అడకత్తెరలో పోకచెక్కవలె

No comments:

Post a Comment