Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 6

* ఎద్దుకు తూలాలని ఉంది, గంతకు పడాలనీ ఉంది.
* ఎద్దుకెగవేయ, బఱ్ఱెకు సగవేయ.
* ఎద్దుకేమి తెలుసు అటుకుల చవి (రుచి).
* ఎద్దుకొద్ది సేద్యం, సద్ది కొద్దీ పయనం.
* ఎద్దు కొవ్వి ఆబోతుపై రంకె వేసినట్లు.
* ఎద్దుగా ఏడది బ్రతికేకంటే ఆబోతుగా (ఇరు) ఆరునెలలే చాలు.
* ఎద్దు చచ్చినా వాత బాగా పడింది.
* ఎద్దు చేనుమేసిపోతే గాడిదకు చెవులుకోసినట్లు.
* ఎద్దు తన్నుతుందని గాడిద కాళ్ళు పట్టుకొన్నట్లు.
* ఎద్దు తన్నుతుందని గుఱ్ఱంచాటు చేరినట్లు.
* ఎద్దుతో వ్యవసాయం, ఆలితో సంసారం.
* ఎద్దుని అడిగా గంత కట్టేది?
* ఎద్దును కొద్దిలో కొనరాదు, బట్టను భారీలో కొనరాదు.
* ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడ్పుచూస్తే ఏడ్పు వస్తుంది.
* ఎద్దును ముద్దుపెట్టబోతే, ఎడమకాలితో తన్నింది.
* ఎద్దునోటికి చొప్ప అందించినట్లు.
* ఎద్దున్న వాడి వ్యవసాయం చూడు, మంది ఉన్నవాడి మారుబలం చూడు.
* ఎద్దు పుండు కాకికి ముద్దా?
* ఎద్దుపుండు కాకికి రుచి.
* ఎద్దు పొడుస్తుందని తన్నే గుర్రం చాటున చేరినట్లు.
* ఎద్దు బీదదయితే చేను బీద.
* ఎద్దు మంచిదైతే వేరూరికి పోతుందా?
* ఎద్దు మోసినంత, గోనె పట్తినంత.
* ఎద్దురొమ్ములో ముల్లుకఱ్ఱ పొడిచినట్లు.
* ఎద్దులవెంటనే తాళ్ళు.
* ఎద్దులా కష్టపడినా ఎంగిలి గంజే గతి.
* ఎద్దులు కాసినందుకు, ముద్దలు మింగినందుకు సరిపోయిందిపో అన్నాడట.
* ఎద్దులు చేయును, గుఱ్ఱాలు మొయ్యను (మేయును).
* ఎద్దులెప్పటివేగానీ గోనెలుమాత్రం కొత్తవి.
* ఎద్దువలే ఉన్నావే తేలుమంత్రం తెలియదా?

No comments:

Post a Comment