Saturday, June 15, 2019

అ - ఆ >>>> 7

* అడక్కుండా చెప్పులిచ్చాడు అడిగితే గుర్రం యిస్తాడన్నట్లు
* అడక్కుంటే జోలె అడుక్కుపోతోంది
* అడగనిదే అమ్మయినా పెట్టదు
* అడవి ఉసిరికాయకు, సముద్రపు ఉప్పుకు జత కలసినట్లు
* అడవి పత్రి - వాన నీరు
* అడవి గాచిన వెన్నెల - ముదిమిన చేసిన పెళ్ళి ఒక్కటే
* అడవిలో తిని ఆకుతో తుడుచుకున్నట్లు
* అడిగిందే పాపం - అనుగ్రహించటం తన స్వభావం అన్నట్లు
* అడిగింది రొట్టె - యిచ్చింది రాయి
* అడిగితే చిరాకు - అడగకపోతే పరాకు
* అడిగేటంత అన్యాయానికి లోబడతానా?
* అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
* అడవిలో పడ్డట్లుగా
* అడుక్కుతినేవాడికి ఆలయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు
* అడుక్కుతినేవాడికి అరవై ఆరు కూరలు
* అడుక్కుతినేవాడికి అరవై వూళ్ళు
* అడుక్కోవటానికి ఈ గడప కాకపోతే యింకో గడప
* అడుగు తప్పితే పిడుగు తప్పుతుంది
* అడుగు దాటితే అక్కర దాటుతుంది
* అడుగున ఎరువుకొద్దీ పైన పంట బంగారం
* అడుగు పెట్టగానే పిడుగు పడ్డట్లు
* అడుసు త్రొక్కనేల - కాలుకడగనేల?
* అడ్డాలనాడు బిడ్డలు గానీ గడ్డాలనాడు బిడ్డలా?
* అడ్డం దిడ్డం తిరిగే తెడ్డుకు రుచేం తెలుసు?
* అడ్డెడు తినేవాడికి ఆలెందుకు? యిద్దుము మోసేవానికి ఎద్దెందుకు?
* అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు గొడ్డు తినిపోయిందిట
* అడ్డేటు మీద గుడ్డేటు
* అతడెంత ఘనుడైనా అడుగక తప్పదు
* అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న
* అత్యాశ నిత్య దరిద్రం
* అతికించిన కోరమీసం ఎంతసేపు నిలుస్తుంది?
* అతి చేస్తే మతి చెడుతుంది
* అతితెలివికి ఆకలెక్కువ
* అతితెలివికి మగబుద్ధి అన్నట్లు
* అతిరహస్యం బట్టబయలు

No comments:

Post a Comment