Saturday, June 15, 2019

ఉ - ఊ >>>> 6

* ఉల్లిగడ్డంత కోడలువస్తే వల్లికలోఉన్న అత్త ఉలికి ఉలికి పడిందట. (వల్లిక=స్మశానం).
* ఉల్లి చేసినమేలి తల్లి ఐనా చెయ్యదు.
* ఉల్లితిన్న కోమటి ఊరుకొన్నట్టు. (నోరు తెరిస్తే కంపని).
* ఉల్లిని నమ్మి తల్లిని నమ్మి చెడినవాడులేడు.
* ఉల్లి పదితల్లుల పెట్టు.
* ఉల్లి పువ్వు ఉల్లిపువ్వే, మల్లెపువ్వు మల్లెపువ్వే.
* ఉల్లి మల్లి అవుతుందా? ఉంచుకున్నది పెళ్ళాం అవుతుందా?
* ఉల్లి మల్లికాదు, కాకి కోకిల కాదు.
* ఉల్లి ముట్టనిదే వాసన రాదు.
* ఉసురు (ఊపిరి) ఉంటే, ఉప్పుకల్లు అమ్ముకొని బ్రతుకవచ్చు.
* 'ఊ' అంటే తప్పు 'ఆ " అంటే తప్పు; నారాయణా అంటే బూతు (మాట).
* ఊక ఊకే నూక నూకే!
* ఊగిఊగి ఉయ్యాల ఉన్నచోటికే వస్తుంది.
* ఊట వేసిన మడి, వాత వేసిన పశువు (కొరగావు).
* ఊదరకూ డెన్నాళ్ళు, ఉద్యోగం ఎన్నాళ్ళు.
* ఊదర ఒక ధాన్యమా? ఉండ్రాళ్ళొక పిండివంటా? (ఊదర=వరిచేలలోని ఒక కలుపు మొక్క).
* ఊదువేయనిదే పీరు లేవదు. (ఊదు= సంబ్రాణి ధూపం).
* ఊపిరి పట్టితే బొజ్జ నిండునా?
* ఊబ నామొప్గుడు, ఊళ్ళో ఉన్నా ఒకటే, దండులో ఉన్నా ఒకతే. (ఊబ=నపుంసకుడు).
* ఊబనామొగుడు ఉండీ ఒకటే లేకా ఒకటే.
* ఊరంతా ఉత్తరం చూస్తే, దాసరిపుల్లయ్య దక్షిణం చూసాడట.
* ఊరంతా ఉల్లి: నీవెందుకే తల్లి.
* ఊరంత ఉల్లిపూస్తే మాలపల్లి మల్లె పూసె.
* ఊరంతా ఊరిముఖం, దాసరి తాళ్ళముఖం (తాళ్ళు=తాటిచెట్ల తోపు).
* ఊరంతా ఒకటైతే చేనంతా ఒకమేర.
* ఊరంతా ఒక త్రోవ, ఉలిపికట్టెది ఇంకొక త్రోవ.
* ఊరంతా ఒక త్రోవ, ఊదుదోకది ఇంకొకదోవ. (ఉడుదోక=విడిచిన ఆడది; అప్రయోజకురాలు).
* ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్టుకోను చోటులేదు.
* ఊరంతా చుట్టాలు, ఉచ్చపోసుకోను చోటులేదు.
* ఊరంతా మేనమామలు ఉచ్చపోసుకోను చోటులేదు.

No comments:

Post a Comment