* ఎద్దువలే కుక్కనుపెంచి రెడ్డి తానే (ఆలుమొగలు తామే) మొరిగినాడ(ర)ట.
* ఎద్దువలే తిని మొద్దువలే నిద్రపోయినట్లు.
* ఎద్దయినా ఏడాదికి నేర్చును, మొద్దు ముప్పై ఏళ్ళయినా నేర్వడు.
* ఎనుబోతు పేదల యశముగోరు.
* ఎనుబోతు బలిసి ఏనుగవలెనున్న భ్రమరములకు మదప్రాప్తి లేదు.
* ఎనుబోతుమీద వానకురిసినట్లు.
* ఎనుము గొప్పదయినా ఏనుగును బోలునా?
* ఎనుము ముసలి, ఏనాది ముసలి లేవు.
* ఎనుముకు మేతవేసి ఆవుని పితికినట్లు.
* ఎన్నడూ గానని మొగానికి ఇప్పపూత బెల్లమంట.
* ఎన్నడులేని కల్మి కల్గెనా వెన్నున కద్దమడుగు, కొనవేళ్ళకు ముచ్చెలు తొడుగు.
* ఎన్నడూ ఎక్కని రెడ్డి గుఱ్ఱమెక్కితే వెనుక ముందయిందట.
* ఎన్నడూ ఎఱుగని వానిని ఎద్దుల బేరానికి పంపితే ఎఱ్ఱెద్దుకు ఎనభై, నల్లెద్దుకు నలభై అన్నడట.
* ఎన్నడు దొరకనమ్మకు ఏగాణి దొరికితే, ఏడు ముళ్ళు వేసిందట.
* ఎన్నడూ నా మొగుడు 'ఎల్లి, ఎల్లి,' అనలేదుగానీ ఇల్లు కాలిననాడు ఎల్లి ఎల్లి అన్నాడు.
* ఎన్ని పూటులేసినా ఇత్తడి ఇత్తడే, పుత్తడి పుత్తడే.
* ఎన్నిబూతులైనా పిడికెడు కొఱ్ఱలతో సరికావు.
* ఎన్ని ముట్టుపాతలైతే ఒక కట్టుకోక అవుతుంది?
* ఎన్ని విద్యలైనా కులవిద్యకు సాటిరావు.
* ఎన్ని సూదులైతే ఒక గడ్డపారగానూ?
* ఎన్నో వ్రణాలు కొసానుగానీ నా వ్రణమంత తీపులేదు అన్నాడుట.
* ఎప్పుడూ ఎరగనోడు ఏతాము తొక్కితే ఏటా ఆరుబారల అప్పు.
* ఎప్పుడూ పెట్టే నాలుగూపెట్టి (చీవాట్లు)కొఱ్ఱలచేట బయటపెట్టు అన్నాడుట.
* ఎప్పుడూ యోచిస్తుండేవాడు అభాగ్యుడు, ఎన్నడూ యోచించనివాడు అవివేకి.
* ఎప్పటి అమ్మకు నిప్పటే గతి. (నిప్పటి=అరిసె).
* ఎముక కొరికే కుక్క ఇనుము కొరుకునా?
* ఎముకలేని నాలుక ఎత్లాతిప్పినా తిరుగుతుంది.
* ఎరవుల కంచమని ఎదో పెట్టుకు తిన్నట్లు.
* ఎరువుల సొమ్ములు బరువుచేటు, తియ్యను పెట్టను తీపులచేటు, దానిలో ఒకటిపోతే అప్పుల చేటు.
* ఎరువు ఉంటే, వెఱ్ఱివాడూ సేద్యగాడే.

No comments:
Post a Comment