Saturday, June 15, 2019

ఇ - ఈ >>>> 7

* ఇవ్వాళ గుఱ్ఱం ఎక్కడమెందుకు, రేపు గాడిద నెక్కడం ఎందుకు?
* ఇష్టం లేని పెళ్ళాన్ని 'ఒసే' అన్నా తప్పే, 'అమ్మా' అన్నా తప్పే.
* ఇష్టంలేని మొగుణ్ణి చూసి కొనవేళ్ళతో మొత్తుకున్నట్లు.
* ఇష్టమైన వస్తువు ఇంగువతో సమానం.
* ఇష్టమైన వారి పెంట ఇంగువతో సమానం.
* ఇసుకతో తాడు పేమినట్లు.
* ఇసుక బావి తవ్వ ఎవరి వశం?
* ఇస్తినమ్మా వాయనం అంటే, పుచ్చుకుంటినమ్మ వాయనమన్నట్లు.
* ఇస్తే చెడేదిలేదు, చస్తే వచ్చేదీలేదు.
* ఇస్తే పెండ్లి, ఇవ్వకపోతే పెటాకులు. (పెడాకులు).
* ఇస్తే వరం, పెడితే శాపం.
* ఇస్తే హిరణ్యదానం, ఇవ్వకపోతే కన్యాదానం.
* ఇహం పరం లేనమ్మ, ఇచ్చినచోటే ఉండమ్మా.
* ఇహం మన్ను, పరం పైడి.
* ఇహమూ పరమూ లేని మొగుడు ఉంటేనేమీ పోతే నేమి?
* 'ఈ' (ఇవ్వు)అన్నది ఈ ఇంటలేదు, 'తే' అన్నది తరతరాలుగా వస్తున్నది.
* ఈ ఇంట ఆచారమా? మా గ్రహచారమా?
* ఈ ఊరికావూరెంత దూరమో, ఆ వూరికి ఈ ఊరూ అంతే.
* ఈ ఊళ్ళో పెద్దలెవరంటే తాళ్ళు (తాడిచెట్లు, దాతలెవరంటే చాకళ్ళు.
* ఈ ఎద్దు ఆ ఎద్దు జోడు, (అయితే) ఈ చేను ఆ చేను బీడు.
* ఈ కంటికి రెప్ప దూరమా?
* ఈకలు తీసిన కోడి, ఈన(నె)లు తీసిన మాల.
* ఈకెలు తోకలు దులిపి, నూకలలో కలిపినట్లు.
* ఈకలు లేవుఇగానీ, వింజమూరి పుంజే.
* ఈ కష్టాలకన్నా మా అత్త పెట్టే కష్టాలే బాగున్నాయి అన్నదిట.
* ఈ కీలు మళ్ళితేనే ఆ కీలు మళ్ళుతుంది.
* ఈగ పుండు మీద గంటు పెడుతుందిగానీ, గట్టి వంటి మీద వాలదు.
* ఈగ వ్రణం కోరు, నక్క పీనుగ కోరు.
* ఈగను కప్ప మింగితే, కప్పను పాము మింగుతుంది.
* ఈ గుడి నేను కట్టించలేదు, ఆ గుడి ఎవరు కట్టించారో నేనెరుగను అన్నాడుట.

No comments:

Post a Comment