Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 8

* ఎరువును నమ్మి బొంతను పొయ్యిలో పెట్టుకున్నట్లు.
* ఎరువుపెట్టిన పొలము, ఏలుబడి అయిన కోడలు.
* ఎరువులేని పైరు, పరువులేని రైతు.
* ఎరువులేని పొలము, వేగంలేని ఏరు.
* ఎరువులేని సేద్యం కరువుదేవతకు వాద్యం.
* ఎరువు వేయగానే (ఊసర) క్షేత్రం ఫలించునా?
* ఎరువు స్థిరం కాదు బరువు తేలిక కాదు.
* ఎరువూ వెంపలిస్తే ఎదిగిందే పైరు.
* ఎఱిగి ఎఱిగి చేసిన పాపం, ఏడ్చి ఏడ్చి పోగొట్టుకోవలె.
* ఎఱుక తేలిన (ఏలిన) ఏడుఘడియలకు వాన.
* ఎఱ్ఱకోమటిని, నల్ల బ్రాహ్మణుడిని నమ్మరాదు.
* ఎఱ్ఱమాదిగను, నల్ల బాపని నమ్మరాదు.
* ఎఱ్ఱని ఆకాశానికి బఱ్ఱున వానలు.
* ఎఱ్ఱనేలవంట ఒకనాటి వంట.
* ఎలమఱ్ఱుకు ఎద్దునివ్వరాదు, పామఱ్ఱుకు పడుచునివ్వరాదు.
* ఎలుక ఎప్పుడూ తన దిక్కుకే తవ్వుకుంటుంది.
* ఎలుక ఎంత ఏడ్చినా పిల్లి కనికరిస్తుందా?
* ఎలుక ఏట్లోపోతేనేమి? పులి బోనున పడితేనేమి.
* ఎలుకకు పిల్లి సాక్షి (సాక్ష్యం).
* ఎలుక చావుకు పిల్లి మూర్చ పోతుందా?
* ఎలుక తోలు ఎంత తోమినా నలుపే.
* ఎలుక నోట్లో నుంచి ఏనుగు దంతాలు రావు.
* ఎలుకమీద కోపంతో ఇంటికి చిచ్చుపెట్టుకొన్నట్లు.
* ఎలుక సంసారం చూసి పిల్లి మూర్చపోయిందిట.
* ఎల్లపాములు తలెత్తితే, ఎలికపామూ తలెత్తిందిట.
* ఎల్లమ్మ పెళ్ళిలో పులమ్మ శోభనం.
* ఎల్లమ్మ బ్రతుకు తెల్లవారితే తెలుస్తుంది.
* ఎల్లయ్యకు ఎడ్లులేవు, మల్లయ్యకు మనుష్యులు లేరు.
* ఎల్లయ్యకెడ్లు లేవు, మల్లయ్యకు బండిలేదు, తెల్లవార్లు బాడుగే.
* ఎల్లవారమ్మల బ్రతుకు తెల్లారితే తెలుస్తుంది.

No comments:

Post a Comment