* ఊరు దూరము, కాడు దగ్గిర.
* ఊరున్నది, చిప్ప ఉన్నది, నాకేంతక్కువ అన్నట్లు.
* ఊరుపండితే ఊకైనా దొరుకుతుంది.
* ఊరు పుట్టినప్పుడే, ఉగాది పుట్టింది.
* ఊరు పుట్టినప్పటినుండి ఎన్ని ఉగాదులు రాలేదూ, ఎన్ని ఉగాదులు పోలేదూ?
* ఊరు పొమ్మంటున్నది, కాడు రమ్మంటున్నది.
* ఊరుమాసినా పేరు మాయదు.
* ఊరులేక పొలిమేర ఉండునా?
* ఊరువిడిచి పొరుగూరుపోయినా పూనిన కర్మపోదు.
* ఊరేలినా తా పండుటకు మూడు మూరల తావే.
* ఊళ్ళు చేసిన బాకీ కూళ్ళుచేస్తే తీరుతుందా?
* ఊళ్ళేలని వారు రాజ్యాలేలుతారా?
* ఊళ్ళేలే కొడుకు కన్నా ఊపాదానమెత్తే పెనిమిటి మేలు.
* ఊళ్ళో అధికారమైనా ఉండాల, ఊరంచు పొలమైనా ఉండాల.
* ఊళ్ళో ఇల్లులేదు, పొలంలో చేను లేదు.
* ఊళ్ళో పెండ్లయితే ఱంకుముండలకు రాగిసంకటి దిగదు.
* ఊళ్ళోకి రాజుగారు వస్తున్నారంటే, పెండ్లమువంక అనుమానంగా చూసినట్లు.
* ఊళ్ళోకి రవొద్దు రౌతా అంటె గుఱ్ఱాన్ని ఎక్కడ కట్టేసేది అన్నాడట.
* ఊళ్ళో (పెళ్ళికి)పెళ్ళైతే కుక్కలకు హడావుడి.
* ఊళ్ళో ముద్ద గుళ్ళో నిద్ర.
* ఊళ్ళోవాళ్ళ ఉసురోసుకొని, నూరేండ్లు బ్రతకమన్నట్లు.
* ఊళ్ళోవాళ్ళకి పనిచేసి ఒళ్ళంతా దుమ్ము చేసుకొన్నట్లు.
* ఊసరవిల్లి వలే రంగులు మార్చేవాడు.
* ఊసరక్షేత్రంలో అలికితే ఉల్లికోపుల పంట.
* ఊసరక్షేత్రంలో దూసరి తీగ.
* ఊసరక్షేత్రంలో పైరు, ణిరులేని చెరువుకింద సేద్యము.
* ఊహ ఊళ్ళేల మంటే, వ్రాత (రాత) రాళ్ళుమోయమన్నది.
* ఊహలు ఊళ్ళేలుతుంటె, ఖర్మం కట్టెలు మోయిస్తున్నది.
* ఋణము, రణము ఒకటే.
* ఋణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచరాదు.
* ఋషిమూలం, నదిమూలం, స్త్రీమూలం విచారించరాదు.

No comments:
Post a Comment