* గంగ ఈతకు, గరిక మేతకు సరి.
* గంగ కిద్దరి మేలు, అద్దరి కీడునుం గలదే?
* గంగకు, సొంగకు, పంగకు తప్పులేదు.
* గంగిగోవు పాలు గంటెడైన చాలు, కడివడైననేమి ఖరము పాలు?
* గంగను పడ్డ కాపురం గట్టున పడుతుందా?
* గంగమ్మ గయ్యాళైతే, సింగరాజేమి చేస్తాడు?
* గంగలోని ఓడను నమ్మితే భవసాగరమీదవచ్చునా?
* గంగలో మునిగినా కాకి హంస అవుతుందా?
* గంగానమ్మ తెత్తిమీద తురకాడు కాలుపెడితే, కాపువాణ్ణి తీయమన్నదట.
* గంగా స్నానం, తుంగాపానం.
* గంగిరెద్దును బండికి కడితే వాడవాడ, గంగిరావును బండికి కడితే ఇల్లిల్లూ.
* గంజాయి తోటలో తులసి మొక్కవలె.
* గంజాయి పీకకు, కల్లు రేకకు అంటులేదు (ఎంగిలి లేదు).
* గంజి తాగినా లంజ కావాలి.
* గంజి తాగేవానికి మీసాలెగపెట్టె వాడొకడు.
* గంజిలోకి ఉప్పులేకుంటే పాలలోకి పంచదారట.
* గంటెలు పండిన ఇంట, కణుజు పండిన ఇంట కఱవులేదు.
* గంటైనా బలవాలి, గాదైనా తిరగాలి.
* గండం గడిచి పిండం బయటపడినట్లు.
* గంత కట్టేదా? బసవన్నా అంటే, ఊహూ అని, గుగ్గిళ్ళు తింటావా అంటే, అహా అన్నదిట.
* గంతకు తగిన బొంత దొరకనే దొరుకుతుంది.
* గంతకు పడాలని ఉంది, ఎద్దుకు తూలాలనీ (తోయాలనీ) ఉంది.
* గంతలో బావ ఉన్నాడని, సంతలో కాల్మడిచిందట. (కాల్మడుచు=ఒంటికి పోవు).
* గంత బొంత కలిసి గాడిద మోతైనట్లు.
* గంధపు చెక్కలు మోసిన గాడిద వాటి వాసన అనుభవించలేదు.
* గంధం అమ్మినచోటే కట్టెలమ్ముట.
* గంధద్రవ్యాలు మోసినా గాడిద గాడిదే.
* గంధంలో కూసు కల్పినట్లు.
* గంధం సమర్పయామీ అంటే, గొడ్డలి నూరరా అన్నాడట.
* గంధపు పొడిలో బూరగ పట్టినట్లు (ఊదినట్లు).
* గంధమలద మేని కంపు తగ్గినయట్లు.

No comments:
Post a Comment