Saturday, July 13, 2019

గ - ఘ >>>> 2

* గంపదింపుడు ఘనమాయె, పూర్వపు బుద్ధులు పోవాయె.
* గంపదింపులు ఘనమాయే, పూర్వాలు బుగ్గాయె.
* గంపలాభం చిల్లి తీసినట్లు.
* గంప సిడి (సిరి) కాదు, గాలపు సిడి (సిడి=వేదన).
* గచ్చకాయంత బెల్లానికైనా గానుగ కట్టాలి.
* గచ్చకాయల కుండ వలె.
* గచ్చకాయలకు కొన్న గుఱ్ఱం కందకం దాటునా?
* గచ్చపొద పట్టుకొన్నట్లు.
* గచ్చపొద మీద ఇసుకవేసి కయ్యానికి పిలిచినట్లు.
* గచ్చముండ్ల మీద తగులుకొన్న బట్ట గ్రక్కున తీయ వశమా?
* గజముపై చౌడోలు గాడిదకెత్తిన కూయునేగానీ మోయదు.
* గజమూ మిథ్య, పలాయనమూ మిథ్య అన్నట్లు.
* గజశాస్త్రవేత్తలకు గజారోహణం వస్తుందా?
* గజ్జి ఉన్నవాడికి లజ్జ ఉండదు.
* గట్టిగా ఆయూష్యముంటే గఱిక నూరిపోసినా బతుకుతాడు.
* గట్టీగా తిట్టినా గాలికి పోవును.
* గట్టిని విడిచి పొట్టుకు పోరాడినట్లు.
* గట్టి గింజలు విడిచి పొట్టుకు పోరాడినట్లు.
* గట్టు చేరిన వెనుక పుట్టివానితో పోట్లాడినట్లు.
* గట్టు మీదవానికి గప్పాలెక్కువ.
* గట్టెక్కితి, పుట్టెక్కితి, మేటి మెట్టెక్కితి అన్నట్లు.
* గడేక్కు తిమ్మన్నా! గంతులు వేయి తిమ్మన్నా!
* గడనుడుగు మగని జూచిన నడపీనుగ వచ్చినట్లు నగుదురు.
* గడించేది ఒకడు, అనుభవించే దింకొకడు.
* గడించే వాడొకడు, గుణించే వాడొకడు.
* గడీ ఎక్కా నేనే, గంతులు వేయా నేనే.
* గడియ పురుసత్తూ లేదు, గవ్వ ఆదాయం లేదు.
* గడియారం చూచి గడాలు కట్టిస్తారా? (గడాలు= అరకలు, నాగళ్ళు).
* గడుసురాలు మగని గంపతో నమ్మురా!
* గడుసువాడు మూడందాల చెడును.
* గడ్డెము కట్టిన గొడ్డెము విడుస్తుంది.

No comments:

Post a Comment