* పసరం లేత, పైరు ముదురు.
* పసిపిల్లకు పాలకుండకు దృష్టి తగలకుండా చూడాలి.
* పసిరికలవాని కండ్లకు లోకమంతా పచ్చనే (పసిరికలు=కామెర్లు).
* పసుపు ఇదిగో అంటే ముసుగు ఇదిగో అన్నట్లు.
* పసుపు కుంకుమ కోసం పదామడలైనా పరుగెత్తాల.
* పసుపుకొమ్ము పెట్టని కోమటి పట్టణమంతా చూరవదిలాడట (వసారమంతా కొల్ల లిచ్చాడట)(చూర=కొల్ల).
* పసుపూ బొట్టు పెట్టి పెండ్లికి పిలిస్తే వెళ్ళక, పెంకు పట్టుకొని పులుసుకు వెళ్ళిందట.
* పసుపేమే? అంటే పెండ్లి; ముసుగేమే? అంటే ముండ అన్నట్లు.
* పక్షిమీద గురిపెట్టి పందిని ఏసినట్లు (కొట్టినట్లు).
* పాండవులవారి సంపాదన ధుర్యోధనులవారి పిండాకూళ్ళకు సరి
* పాండిత్యానికి తనకంతా తెలుసునన్న అహంకారమున్నది. వివేకానికి తనకేమి తెలియదన్న వినమ్రత ఉన్నది.
* పాకనాటి పతివ్రత లాగ.
* పాకలపాటివారి రణకొమ్మువలె.
* పాకాల చెరువు జూచి, ఆ నీళ్ళన్నీ తానే దున్నాలని దున్నపోతు గుండె పదిలి చచ్చిందట.
* పాకీదానితో సరసం కంటే, అత్తరుసాహేబుతో కలహం మేలు.
* పాగా, పంచకట్టు చూచి భద్రిరాజు వనుకున్నానే! వీర్రాజువటోయి పేర్రాజా.
* పాచికూట్లో కలిపోస్తే పదునుకు వచ్చునా?
* పాచిపండ్ల దాసరికి కూటిమీదనే ఆలాపన.
* పాచిపండ్ల వాడు పేర్చి పెడితే, బంగారు పండ్ల వాడు బరుక్కతిన్నాడట.
* పాచిపెత్తనం పల్లెలో పది గడియలు. (పలుదోముకోకుండానే పెత్తనాలు చేస్తారు).
* పాచిముండ పర్వతం బోతే (శ్రీశైలం) ఎక్కనూ దిగనూ దప్ప ఏమీ మిగలలేదట.
* పాచిముఖాన ఎప్పుడైతేనేం భూపాళాలు చదవటానికి.
* పాచ్చాసాహేబు కూతురైనా, పెండ్లికొడుక్కి పెండ్లామే.
* పాటిమీద గంగానమ్మకు కూటిమీదే లోకం.
* పాటిమీద దేవరకు కూటిమీదనే ఆలాపన.
* పాటిమీది వ్యవసాయం కూటికైనా రాదు.
* పాటు కలిగితే కూటికి కొదువా?
* పాటుకు కోడెదూడ, కూటికి పాడిదూడ (పాటుకు=పనికి).
* పాటు చేతగానివాడు మాటలకు మొనగాడు.
* పాట్లెల్లా పట్టేడు కూటి కొరకే.

No comments:
Post a Comment