Sunday, July 14, 2019

ప - ఫ >>>> 9

* పలుగాకులకు మేలు లేదు, పంజగొడ్డుకు పాలులేవు (పంజ=గొడ్డుబోతు (పిరికి)).
* పలుగులు కాల్చి పక్కలో వేసినట్లు.
* పలుచన పంట వేడుక, ఒత్తు చూపుల వేడుక.
* పలుచన పాతళ్ళు కోరు, ఒత్తు వాముల గోరు.
* పలుచని గొడ్డు పాలెక్కువ, పిండని ఆవుకు పొదుగెక్కువ.
* పలుదని పైరు పాతరలు నింపు.
* పలుపు దీసుకొని కొట్టరా మొగుడా, పదాలు పాడుతా నన్నదిట.
* పలువతో సరసము ప్రాణ హాని.
* పలువురు నడచిన తెరువే పదిలమైనది.
* పలువురు నడిచిన తెరువున పులుమొలవదు, మొలిచెనేని పొదలదు.
* పల్నాటిలో పోకకు పుట్టెడు దొరికితే, ఆ పోక దొరకక పొర్లి పొర్లి ఏడ్చిందట.
* పల్లం వైపుకే నీళ్ళు పారేది.
* పల్లము దున్నినవాడు పల్లకి ఎక్కుతాడు.
* పల్లమునకు ఏడు దిక్కులు, మెఱకకు నాలుగు దిక్కులు.
* పల్లాన్న పోయినా ఏనుగే, మిట్టన పోయినా ఏనుగే.
* పల్లికమ్మ (పలకమ్మ) గడిస్తే, తల్లితో కలుస్తాను.
* పల్లెటూరికి పదిదారులు (డొంకలు).
* పల్లెతిరిగినా ఏడేచీరలు, పట్నం తిరిగినా ఏడేచీరలు.
* పల్లెదాని దగ్గర పొలుసుకంపు అన్నట్లు (చేపలకంపు).
* పశువుల పాలు మేపును బట్టి.
* పశువుల రొచ్చు గుంట, పంటకాపు గచ్చు పాతర.
* పశువులు కాచేవాడు పనిబాట కక్కఱకు రాడు.
* పశువులు జస్తే బొరగలు వాలినట్లు (బొరగలు=రాబంధులు).
* పశువులు, శిశువులు గానరసం బెరిగినట్లు.
* పశువు వచ్చిన వేళ, పడుచు వచ్చిన వేళ.
* పస చెడి అత్తింట పడియుండుట రోత.
* పసరం ఒంటిపూట పడ్డా, బ్రాహ్మణుడు ఒంటిపూట పడ్డా మానెడు.
* పసరం పంజైతే పసులకాపరి తప్పు.
* పసిపిల్లలు, త్రాగుబోతులు నిజం చెబుతారు.
* పసిమిరోగపు తొత్తుకు మిసిమి మెండు.

No comments:

Post a Comment