* పాడగా పాడగా పాట, మూల్గగా మూల్గగా రోగం.
* పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి.
* పాడి ఆవును దానం చేసి, పాలు తాను పితుక్కొన్నట్లు.
* పాడికి పంట తమ్ముదు.
* పాడికి పసిబిడ్డలకు దిష్టి (దృష్టిదోషం) ఉండదు.
* పాడికుండ పగులకొట్టు కొనినట్లు.
* పాడి గుట్టు-పంట రట్టు.
* పాడితో పంట ఓపదు.
* పాడి దాచవలె, పంట పొగడవలె.
* పాడి పసరము, చంటిబిడ్డ ఒకటి.
* పాడి లేని ఇల్లు, పాడుబడ్డ బీడు.
* పాడి లేని ఇల్లు, పేడ లేని చేను.
* పాడి లేని గొడ్డు, బిడ్డ లేని ఆలు.
* పాడు ఊరిలో పొగిడేవారు లేరు, నాకు నేనే పొగుడుకుంటానని అనుకున్నట్లు.
* పాడు ఊరికి మంచపుకోడే పోతురాజు.
* పాడు గోడకైనా పూత చక్కన, కోతి ముండకైనా రాత చక్కన.
* పాడుబడిన ఊరికి నక్క తలారి.
* పాడుబడిన ఇంట్లో పంజులు ఎత్తినట్లు (పంజులు=దివిటీలు).
* పాణి యాహార కబళంబు పారవైచి, కర్పూరము నాకు పినవెర్రికూన.
* పాత ఒక రోత, కొత్త ఒక వింత.
* పాతగుడ్డ కుట్టు నూలు చేటు.
* పాడుగోడకు పూత చక్కన, పాతముండకు కోక చక్కన.
* పాత చుట్టం- పాత చింతకాయ పచ్చడి.
* పాతచేటకు పూత అందం (పూత=అలుకుట)
* పాతతంగెడు పూవు పండగనాటికైనా పనికివస్తుంది.
* పాతది పనికిరాదు, కొత్తది కొరగాదు.
* పాతపని పట్టకురా! పల్లెకు దొంగవి కాకురా.
* పాతబావి నీరు, మేకలపాడి రోత (ప్రాకొన్న నూతి ఉదకము, మేకలపాడియును రోత).
* పాతముండ కలవరిస్తే, కొత్తముండకు దయ్యం పట్టినట్లు.
* పాతముండ లందఱూ పోగై, కొత్తముండ తాడు తెంచినట్లు.

No comments:
Post a Comment