* నీ ఎడమచెయ్యి తియ్యి నా పుఱ్ఱచెయ్యి పెడతాను అన్నట్లు.
* నీ కంటి నుండే దూలంమరచి ఎదుటివాని కంట నలుసు ఎన్నకు.
* నీకత్తికి రెండుపక్కలా పదును (రెండువాదరులు).
* నీకు ఆయన ఏమికావలె? అని అడిగితే, త్రోవలో పోతే " వారు " కావలె అన్నదట.
* నీకెక్కడ అనుమానమో నాకూ అక్కడనే సందేహం.
* నీకెక్కడ సంశయమో నాకూ అక్కడనే సందేహం.
* నీకు ఒక దండం, నీ బువ్వ కొకదండం.
* నీకు ఓపిక ఉండాలేగానీ నేను కనలేకపోతానా అన్నదట.
* నీకు నాకు పడదు, రోలెక్కి తలంబ్రాలు పోయి.
* నీకు బెబ్బెబ్బే, నీయబ్బకూ బెబ్బెబ్బే.
* నీకు మూతికి మీసాలుంటే నాకు ముంజేతికి వెంట్రుకలున్నవన్నదట (పల్నాటి నాయకురాలు నాగమ్మ బ్రహ్మనాయకునితో).
* నీకు రానిది, నేను విననిది, లోకములో లేనిది చెప్పమన్నట్లు.
* నీకు సిగ్గులేదు, నాకు ఎగ్గు లేదు, ఎప్పటిమాదిరే వచ్చిపోతుండ మన్నదిట (మిండని).
* నీ కూడు తిని, నీ బట్టకట్టి, నాకు కాపురం చేయమన్నాడట.
* నీ చంకనేమిటోయీ? అంటే నాచంక నాకయ్యా (చంకన- ఆకు) అన్నాడట.
* నీకులానికి సొడ్డంటే, చిన్నప్పుడే వదలివేసినా అన్నదట.
* నీ చెవులకు రాగిపోగులే అంటే, అవీ నీకు లేవే అన్నట్లు.
* నీకేమీ తేరగాడవు! నూకేవే గానీ, కడుపు నొప్పెరుగవు. (నూకుట= దొబ్బుట అనుట, నూకులు= ఎత్తులు, ప్రయత్నాలు, పీకెలు అనిగూడా)
* నీచుకాడ చూడరా పాచుగాడి గుణాం (మంసము, చేపల పంపకంలో పట్టింపులు ఎక్కువ).
* నీటికాకి మీను మునుగ నిరతము దయ స్నానమగునా?
* నీటికి కలువ, మాటకు చలువ.
* నీటికి నాచు తెగులు, నాతికి రంకు తెగులు.
* నీటికి (నాచు) పాచితెవు(గు)లు, మాటకు మాట తెవులు, కులానికి కులం తెవులు.
* నీటికొలది తామరతూడు (తామరలకు).
* నీటిపైన గుండు నిలుచునా మునగక.
* నీటిలో జాడలు వెదకినట్లు.
* నీటిలో కప్ప నీరు త్రాగకుంటుందా?
* నీ తలమీద తేలు ఉన్నదంటే, నీ చేతితోనే కాస్త తీసివేయ మన్నాడట.
* నీతిలేనివాడు కోతికంటే బీడు.
* నీతివర్తనమును, కీర్తి దాని క్రీనీడవలె వెంటాడుచుండును.

No comments:
Post a Comment