Saturday, July 13, 2019

గ - ఘ >>>> 11

* గుఱ్ఱం ఎక్కేవాడే పడేది.
* గుఱ్ఱం, గాడిదను ఒకటిగా చూచినట్లు (చేసినట్లు).
* గుఱ్ఱం చవలం, జీను ముచ్చవలం. (చెవలం=ఒకనాణెం, పావలాలో 1/4 భాగం).
* గుఱ్ఱం కడుపులో గాడిదపిల్ల పుట్టునా?
* గుఱ్ఱము గుగ్గిళ్ళు తింటుంటే, గాడిదకు కడుపునొప్పి వచ్చిందట.
* గుఱ్ఱము చచ్చిందికాక, గుంత తవ్వను ఒక రూక.
* గుఱ్ఱము పేరు గోడా అయితే, గోడపేరు గుర్రం గాదా, ఇంకనాకు ఉరుదూ అంతా తెలుసు అన్నాడట.
* గుఱ్ఱము పోతూ గూటాము పీకుకొని పోయినట్లు.
* గుఱ్ఱము అశ్వమూ కలిసి గుశ్వమైనట్లు.
* గుఱ్ఱానికి కొమ్ములు మొలిస్తే ఒక్కరినీ ఉండనీయదు.
* గుఱ్ఱానికి గుగ్గిళ్ళు తిన నేర్పవలెనా?
* గుఱ్ఱానికి గుద్దలో కాలితే అరిగగడ్డికూడా మేస్తుంది.
* గుఱ్ఱానికి సకిలింత, సంగీతానికి ఇకిలింతా ఉండాల.
* గుఱ్ఱానికి, సన్యాసికి, విధవకు, బ్రహ్మచారికి ఎప్పుడూ మైధున చింతే.
* గుఱ్ఱానికి తోక ఉండటం తనమటుకు తాను విసురుకోనేగానీ కడమ గుఱ్ఱాలకు విసురునా?
* గుఱ్ఱాన్ని గుగ్గిళ్ళకు అమ్మినట్లు.
* గుఱ్ఱాన్ని చూచి కుంట నారభించినట్లు.
* గుఱ్ఱాన్ని చూస్తే కాళ్ళు నొప్పి.
* గుఱ్ఱాన్ని తొట్టిదగ్గరకు ఈడ్చుకుపోగలమే గానీ త్రాగించలేము.
* గుళ్ళోదేవునికి అంగట్లో బెల్లం నైవేద్యం.
* గుళ్ళో దేవునికి నైవేద్యం లేకుంటే, పూజారి పులిహోర కేడ్చాడట.
* గుళ్ళో పిత్తకపోతే గుగ్గిలం వేసినంత పుణ్యం.
* గువ్వకూర్చిన్న టెంకాయి, గూబకూర్చున్న కొంప కొరగావు.
* గువ్వ గూడేక్కెను, అవ్వ మంచమెక్కెను.
* గువ్వ గూడెక్కె, రాజు మేడెక్కె.
*  గుసగుసలు వచ్చి గుడీసెకు దాడితెచ్చె.
* గుసగుస యోచనలు గుడిసెలు తీయటానికి కారణం.

No comments:

Post a Comment