Saturday, July 13, 2019

గ - ఘ >>>> 12

* గూటి గూటంతో గుండెలు గుద్దుకొన్నట్లు.
* గూట్లో దీపం, నోట్లో ముద్ద.
* గూట్లో మిరపకాయ, గుంటలో బువ్వ.
* గూట్లో మిరపకాయ చూస్తూ అన్నం తినమన్నట్లు.
* గూదదిగిన పేరంటాలు అత్తగారింట ఉన్నా ఒకటే, అమ్మగారింట ఉన్నా ఒకటే.
* గూనికి తోడు దొబ్బుడు వాయువు.
* గూని గుగ్గిరిచ్చె, దండు దగ్గరొచ్చె.
* గూని దున్నకంటే, గుడ్డిదున్న మేలు.
* గూనివాని ఒడుపు పడుకొన్నప్పుడు చూడాలి.
* గూనువీపు కుదురు అవుతుందా?
* గూబ ఎక్కిన కొంప చెడును.
* గూబ ఎక్కిన గృహము కూలు.
* గృహప్రవేశానికి వెడుతు గుడ్లగూబను చంకనబెట్టుకొని పోయినట్లు.
* గెలువని రాజుకు గొప్పాలు మెండు.
* గేదె ఉండగా, దూడ ఉండగా, గుంజకు వచ్చెరా గుఱకవాయువు అన్నట్లు.
* గేదెదూడ ఉండగా గుంజ అరచిందట.
* గొంగట్లో అన్నం తింటూ, వెంట్రుకలు ఏరినట్లు.
* గొంగట్లో గుద్దులాట (ముసుగులో గుద్దులాట).
* గొంతుకలో పచ్చి వెలక్కాయ పడినట్లు.
* గొంతుకోసేవాడు కత్తి ఏమారునా?
* గొంతు చిన్నది, గోలెము పెద్దది (గోలెము=కడుపు).
* గొంతులో పుస్తెబొట్టు, గుంతనక్కంత మొగుడు.
* గొంతెమ్మ కోర్కెలు, ఎండమావుల నీళ్ళు.
* గొంతెమ్మ కోర్కెలకు గాలిమేడలు కట్టడం ఒక లెక్కా పక్కా?
* గొడారిబేరం గొడ్డుకు లాభం (గొడారి=మాదిగ).
* గొడారి వద్ద తోలు కొన్నట్లు.
* గొడుగు పట్టితే పిడుగుకు అడ్డమా?
* గొడ్డెము తెగిన గ్రాసము పట్టదు.
* గొడ్డలి ఎక్కడపెట్టినావురా? అంటే, కొట్టే చెట్టుదగ్గర; కొట్టె చెట్టు ఎక్కడుందిరా? అంటే, గొడ్డలిదగ్గర అన్నాడుట.
* గొడ్డలిలో దూరినకఱ్ఱ కులానంతా కూలుస్తుంది.

No comments:

Post a Comment