Saturday, July 13, 2019

చ - ఛ >>>> 11

* చీరపేల బొంత ఎప్పుడైనా కాలవేసేదే.
* చీరపోగా నాకో మొగుడు.
* చీరపోతుకు సిరివస్తే, గోలకొండకాడికి గొడుగు తెమ్మన్నదట.
* చీరపోతు లేరివేయటంకన్నా, బొంతను కాల్చివేయటం నిమ్మళం (మేలు).
* చీర సింగారించేప్పటికి, పట్నమంతా చూర (కొల్ల) పోయిందట.
* చీర సింగారించేప్పటికి, ఊరు మాటుమణిగింది.
* చీరే స్త్రీకి శృంగారం.
* చీలమడిమలదాకా చీర ఉంటే, మోకాలుదాకా సిరి ఉంటుందనుకొన్నట్లు.
* చుక్కలూళ్ళో చక్కిలాలు.
* చుట్టం ఆకలి మంచాని కెరుక.
* చుట్టంగా వచ్చి దెయ్యమై పట్టుకొన్నాడట.
* చుట్టకాలిస్తే మాట్లాడనీయదు.
* చుట్టం వచ్చాడంటే, చెప్పులు ఎక్కడవదిలాడో చూసిరా అన్నట్లు.
* చుట్టతాగి చూరులో పెడితే ఇల్లుకాలి వెళ్ళవలసి వచ్చిందట.
* చుట్టము చేప మూన్నాళ్ళకు మురుగుకంపు కొట్టును.
* చుట్టమై చూడవస్తే దెయ్యమై పట్తుకున్నాడట.
* చుట్టరికం, పేరంటం కలిసివచ్చినట్లు.
* చుట్టాలకు పెట్టినిల్లు చూఱపోయింది, వేల్పులకు పెట్టినిల్లు హెచ్చిపోయింది.
* చుట్టు అయినా మెట్టదారి మేలు. (దారిన పొమ్మన్నారు).
* చుట్టు అయినా సుఖంగా పొయేదిమేలు.
* చుట్టు అయినా సుళువుదారి మేలు.
* చుట్టుకపోయే చాప, మూసుకుపోయే తలుపు, అలిగిపోయే పెండ్లాము.
* చుట్టుడు చాప, విసురుడు తలుపు, పెడసరపు పెండ్లాము.
* చుట్టూ చూరుమంగళం, నడుమ జయమంగళం.
* చుట్టూరా శ్రీవైష్ణవులే, చూస్తే కల్లుకుండ లేదు.
* చూచింది పాము, కఱచింది మామిడిటెంక.
* చూచిందెల్లా సుంకము, పాసిందెల్లా పంకము.
* చూచిగానీ తాగవలదు, చదివిగానీ వ్రాలుంచవలదు.
* చూచినమ్మ కళ్ళు శూలాలు, మా అమ్మ కళ్ళు పేలాలు.
* చూచి మురుసుకొని, చెప్పి ఏడ్చుకొని.

No comments:

Post a Comment