Saturday, July 13, 2019

చ - ఛ >>>> 12

* చూచిరమ్మంటే కాల్చివచ్చినాడట.
* చూచిరమ్మంటే పెండ్లాడి వచ్చినట్లు.
* చూచేవారుంటే సొమ్ములు పెట్టాలి, చేసే వారుంటే పిల్లలు కనాలి.
* చూడగా చుట్టము లేడు, మ్రొక్కగా దైవము లేడు.
* చూడగా చూడగా గుఱ్ఱం గాడిద అయిందట.
* చూడను చుంచెలుక, గోడలు తవ్వను పందికొక్కు.
* చూడబోతే చుట్టాలు, రమ్మంటే కోపాలు.
* చూడబోతే చుండెలుక (చుంచెలుక) తెంచేదేమో తోలుమోకులు.
* చూడబోతే వెండిగిన్నె, తాగబోతే వెలితిగిన్నె.
* చూడవచ్చిన వారికి శుక్రవారమేమి?
* చూడవమ్మా సుతారాం! ఇంటావిడ అవతారం.
* చూపనిదే చూపెనయ్య నూరవరాజా.
* చూపితే మానం పోయె, చూపకపోతే ప్రాణం పోయె.
* చూపులకు గుఱ్ఱమే కానీ, మఱుకుతనం లేదు (చుఱుకుతనానికి గాడిద).
* చూపులకి చుంచు, పనికి పర్వతం.
* చూపులకు మొగుడే కానీ సుఖానికి మొగుడు కాదు.
* చూపుల పసేగానీ చేపుల పస లేదు.
* చూరులో నిప్పు పెట్టి, కొప్పులో పెట్టనా అన్నట్లు.
* చూస్తూ ఊరకుంటే, మేస్తూ పోయిందట.
* చూస్తే చుక్క, లేస్తే కుక్క.
* చూస్తే నీది, చూడకుంటే నాది.
* చూస్తే పొరపాటు, చూడకుంటే సాపాటు.
* చూస్తే సుంకం, చూడకుంటే బింకం.
* చూస్తే సూది మాదిరి ఉంది, లేస్తే గాలి మాదిరి ఉంది.
* చూపులకు గుర్రమేగానీ, చురుకుదనానికి దున్న.
* చూరుకత్తి తెగుతుందిగానీ, చూపుడుకత్తి తెగుతుందా?
* చెంత దీపమిడక చీకటి పోవునా?
* చెంపలు నెరసిన వెనుక, చామ (చాన) పతివ్రత.
* చెంబు అమ్మి తప్పేలా, తప్పేలా అమ్మి చెంబు.
* చెంబు ఎక్కడపెట్టి మరచిపోయినావురా? అంటే నీళ్ళచాయ (చెంబట్లకు) కూర్చున్న చోటికి ఇటు అన్నాడు; నీళ్ళచాయ ఎక్కడ కూర్చున్నావంటే, చెంబుబెట్టిన దానికి అటు అన్నాడట.

No comments:

Post a Comment