* దొరబిడ్డ అయినా ఒకని ఆలే.
* దొరల చిత్తం, చెట్లనీడ నిలకడలేనివి.
* దొరలు ఇచ్చిన పాల కన్నా, ధరణి ఇచ్చిన పాలు మేలు.
* దొరసానికి దుప్పటిలేదు, తొత్తుకు తొగరు చీరట.
* దొరాల తగులుకొంటున్నావు, ఏమిస్తావో దొరా, అంటే- నీ మనసు మెప్పించి తలకేదో పాత (పాతగుడ్డ) సంపాదించుకోవాలను కొన్నానమ్మా అన్నాడట.
* దొరువులో ఉన్న బఱ్ఱెను, కొమ్ములుజూపి బేరమాడినట్లు (దొరువు= తవ్విన నీటి గుంట).
* దొరే దొంగైతే బంట్రోతు కన్నగాడగును.
* దొలుపుడు ముద్దకు నలుపుడు కారం (దొలుపుడూ=దొర్లు, (గుండ్రని)).
* దోచపండు నెట్టుబ్రోచు ఇనుపకట్టు.
* దోచుకొనిపోయిన వాడు దొర, దొరికినవాడు దొంగ.
* దోత్రం పెద్దదయితే గోత్రం పెద్దదగునా?
* దోనె చేయబోయి సోల చేసాడట.
* దోమలు తగ్గితే చేమలు ఊరును.
* దోర కజ్జం, రామానుజం పొడి.
* దోవను పోయేదెవరయ్యా అంటే, దొబ్బులు తినే నేనయ్యా అన్నట్లు.
* దోవను పోయేదొకడు, దొబ్బులు (దొబ్బలు) తినేదొకడు.
* దోవలో కూర్చుండి దొబ్బలు తిన్నట్లు.
* దోసకాయలు తిన్న కడుపు, దొంగలు పడ్డ ఇల్లు ఒకటే.
* దౌలతున దిరిగినా గులాము గులామే (దౌలతు=సంపద).
* దౌర్భాగ్య దామోదరుడు (నిర్భాగ్య దామోదరుడు).
* ద్రవ్యం దాచినవాడికి తెలుసు లెక్క వ్రాసినవాడికి తెలుసు.
* ద్రావిడ ప్రాణాయామం.
* ద్వారపూడి పచ్చెపువాడు.
* ద్విపదకావ్యం ముదిలంజ దొడ్డికంత.
* ధనం మాట్లాడుతుంటే సత్యం ఊరకుండిపోవును.
* ధనము లెచటికేగు, దానేఘు నెచటికి?
* ధనపతి సఖుడైనా శివుడు బిచ్చమెత్తవలసి వచ్చింది.
* ధనానికి దాపరికం (గుట్టు) సేద్యానికి వెల్లడి (రట్టు).
* ధనికిని చెఱకుపంట, దరిద్రునికి నువ్వు పంట.
* ధనియాలజాతి (చెప్పుతో రాసి బద్దలు చేస్తేగాని మొలవవు- భయానగానీ పనిచేయరు అని).

No comments:
Post a Comment