Saturday, July 13, 2019

ద - ధ >>>> 12

* ధరకు దొర ఎవడు?
* ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ.
* ధరించేదే శాటి, వరించేదే బోటి.
* ధర్మం దరిబేసి నడిగితే ఇచ్చునా? తన్నుక చచ్చునుగాని.
* ధర్మపురిలో దొంగిలించబోతూ, ధార్వాదనుండి వంగుని పోయాడట.
* ధర్మానికి దండుగ లేదు, వెట్టికి పైసా లేదు.
* ధర్మానికి దట్టీ ఇస్తే, ఇంటివెనుకకు పోయి మూరవేసిందట.
* ధర్మానికి పోతే కర్మం చుట్టుకొన్నదట.
* ధర్మోదకాలలో రాని పితురుడు తర్పణాలలో వచ్చినట్లు.
* ధారలేని తిండి దయ్యపు తిండిరా.
* ధారోష్టం, అమృతోత్తమం, దాచినమగడా! వేరుండుమన్నట్లు.
* ధీరుడయినా కావాలి, దీనుడయినా కావాలి.
* ధూపం వేస్తే పాపం పోతుంది.
* ధైర్యలక్ష్మి-ధనలక్ష్మి.
* ధైర్యంలేని రాజు, యోచనలేని మంత్రి.
* ధ్వంసం నారాయణుడు కమతం చేస్తే, పాలికి పందుం- పల్లేరు కాయలు.
* ధ్వంస పారాయణం దంతు మంట.

No comments:

Post a Comment