Saturday, July 13, 2019

గ - ఘ >>>> 13

* గొడ్డావు పాలు గొద్రాలి కిచ్చినట్లు.
* గొడ్డుకు ఎక్కువ డబ్బు, గుడ్డకు తక్కువ డబ్బు పెట్టాలి.
* గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట.
* గొడ్డుకు తిన్నది పుష్టి, మనిషికి ఉన్నది పుష్టి.
* కొడ్డు కొఱికిన కొయ్యకాలు గొఱ్ఱెకు చాలు.
* గొడ్డుటావు (గొడ్డుపోతు) పాలు పితికినట్లు.
* గొడ్డుటావు గోకిన చేపునా?
* గొడ్డును కొని తలుగుకు (వలుపుకు) ఏడుస్తాడు.
* గొడ్డుపోతేమి ఎఱుగురా బిడ్డ చలి.
* గొడ్డు బలిస్తే పాటుకి, మనిషి బలిస్తే కాటికి.
* గొడ్డుపోతు ఆవు గోకితే పాలిస్తుందా?
* గొడ్డు రైతు బిడ్డ.
* గొడ్డులేని వాడు, బిడ్డలేనివాడు ఒకటే.
* గొడ్డు వచ్చినవేళ, బిడ్డ (కోడలు) వచ్చినవేళ.
* గొడ్డువాడు గొడ్డుకేడిస్తే, గొడావివాడు తోలుకేడ్చాడుట.
* గొడ్డోడు గొడ్డుకేడిస్తే, మాలచచ్చినోడు చియ్య కేడ్చినాడుట.
* గొడ్రాలికేమితెలుసు కాన్పునొప్పులు.
* గొడ్రాలి ముండకు గొంతు పెద్ద.
* గొడ్లు కాచేవాణ్ణి కొట్టనివాడు, గొర్రెలు కాచేవాడిని తిట్టనివాడు ఉండడు.
* గొడ్డుకు పెత్తనమిస్తే గోదవరంతా తేలియాడిందట.
* గొప్పగా తెలిసినవారే గోతిలోపడతారు.
* గొప్ప సత్యాలు గొప్పవారివలనే నిరాడంబరంగా ఉండును.
* గొప్పలేని బుద్ధి కొంచమైపోవురా
* గొరగంగా మిగిలిందే జుట్టు.
* గొరిగించి గోపినామం పెట్టినట్లు.
* గొఱ్ఱు గుచ్చిన నేలకు కొఱత ఉండదు.
* గొఱ్ఱె ఎంత ఎదిగినా తోక బెత్తెడే.
* గొఱ్ఱె ఏడిస్తే తోడేలుకు కనికరమా?
* గొఱ్ఱె కటికవాణ్ణి నమ్మినట్లు గొల్లవాణ్ణి నమ్మదు.

No comments:

Post a Comment