* చెంబు కంచం పోతే, ముఖంమీద కొట్టినట్లు ముంత మూకుడు తెచ్చుకోలేదా?
* చెట్టబట్టని నా భీతి, బొట్టు గట్టని కన్య రీతి.
* చెట్టడిచిన చేటెడన్ని, నిటలాంబక మూర్తులు (లింగాలనుట).
* చెట్టుఎక్కి, కాయపట్టిచూచి, దిగివచ్చి రాళ్ళు రువ్వినట్లు.
* చెట్టుఎక్కేవానికి ఎంతదాకా ఎక్కుడు పెట్టగలము?
* చెట్టు ఎక్కిందని నిచ్చన తీసినట్లు.
* చెట్టు ఎక్కేవాడిని ఎంతదాకా తొయ్యగలము?
* చెట్టుకు (మానుకు) కరువు, కోమటికి బరువు లేవు.
* చెట్టుకు చావ నలుపు, మనిషికి చావ తెలుపు.
* చెట్టుకు తగినగాలి (ఎంతచెట్టో అంత గాలి).
* చెట్టుకు పుట్టకు వరుసగానీ, మనిషికేమి వరుసరా మాల నాయాలా?
* చెట్టుకు మడిగుడ్డ కట్టి ఉన్నదిలే, దొంగ చెట్టెక్కడు అన్నదిట సోమిదేవమ్మ.
* చెట్టుకు విస్తళ్ళు కట్టినట్లు.
* చెట్టు చచ్చినా చేప చావదు.
* చెట్టు చెడేకాలానికి కుమ్మమూతి పిందెలు పుట్టును.
* చెట్టునరికి పండ్లు దానము చేయగానే సుకృతి అగునా?
* చెట్టుపెట్టి నాటినవాడు నీళ్ళు పోయడా?
* చెట్టు నాటే దొకడు, ఫలమనుభవించే దొకడు.
* చెట్టు నీడకు పోతే కొమ్మ విరిగి పడ్డట్లు.
* చెట్టును తేరా అంటే గుట్టను తెచ్చినట్లు.
* చెట్టుపట్టించి చేతులు వదిలినట్లు.
* చెట్టు పెరగటం మొదలు నరుకుడికే.
* చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొన్నట్లు.
* చెట్టును బట్టే కాయ.
* చెట్టుమీదనుండి పడ్డవానికి గాయాలెన్నేమిటి?
* చెట్టుమీదిది చేతికి వచ్చినట్టెగానీ, ఇక తొమ్మిదయితే పదవుతాయి.
* చెట్టుమీది వాడు జుట్టుమీదికెక్కె.
* చెట్టుమీది విరులైనా చేతుల కోయక రావు.
* చెట్టులేని చేను, చుట్టము లేని ఊరు.
* చెట్టులేని చోట ఆముదము చెట్టే మహావృక్షము.

No comments:
Post a Comment