Saturday, July 13, 2019

న >>>> 1

* నంగతుంగ నీళ్ళకు పోతే, నీళ్ళన్నీ ఒక రేవుకు వచ్చాయిట.
* నంగనాచి చీర నడివీధిలో ఊడిందట (నంగనాచి=ఏమీ ఎరుగనట్లు నటించుట).
* నంగనాచి- తుంగబుఱ్ఱ (తుంగకు బుఱ్ఱ ఏర్పడదు).
* నంగనాచి- వంగముల్లు.
* నంగనాచులు శరణనగానే అనంగుడు ఙ్ఞానోపదేశం చేయునా?
* నంగి వంగలు మేస్తుంటే, నారికేళాలు దూడలు మేసినవట (నంగి=దూడ కలిగిన ఆవు).
* నంగీ! నమిలి మింగవే అంటే, ఉడికిన చేపలు కరుస్తవి అన్నదట. (నంగి=నంగనాచి, మాటలు వచ్చిరానట్లు ముక్కుతో మాట్లాడేవాడు).
* నందనవనంలో కుందుగడ్డి పెరుగవచ్చు.
* నందనవనంలో నాగుబాముండటం మృగనాభికి పిప్పితగిలినట్లు.
* నందరాయని భాగ్యము నక్కలకూ కుక్కలకూ.
* నందనమ్మలు బాగాపండితే, నారాయణుని చూచినట్లే.
* నంది అంటే నందే, పంది అంటే పందే (పట్టుదల).
* నందిని చేయబోయి పందిని చేసినట్లు.
* నందిని పంది, పందిని నందిని చేయగలవాడు.
* నంది వంగలు మేస్తే, నారికేళాలు దూడలు మేయవా?
* నంద్యాలవారి కవిత్వం కొంత, నా పైత్యం కొంత.
* నంబి కవిత్వం, తంబళ్ళ జోస్యం.
* నంబి పెట్టినదే ప్రసాదం.
* నంబి లింగయ్య, జంగం రంగయ్య ఉండరు.
* నంబివాడు ఎదురైనా, నాగుబాము ఎదురైనా కలిసిరాదు.
* నంబి వారికి, తంబళి వారికి ఒకటే కుంచకోల అన్నట్లు.
* నంబీ! నంబీ! నా పెండ్లికేమి సహాయం చేస్తావంటే, నీ పెండ్లికి నేను ఎదురు రాను పో అన్నాడట.
* నంబీ, నంబీ, నీ పుణ్యాన పెండ్లయిందంటే, నేనేమి చేసినాననగా, తరలి పోయేవేళ, తమరు ఎదురుపడకపోవటమే అన్నాడట.
* నక్క ఎక్కడ? నాగ(క)లోక మెక్కడ?
* నక్క ఒకచోట ఊలవేసి, ఇంకొకచోట గౌరీకల్యాణము పాడునా?
* నక్క కడుపున సింగము పుట్టునా?
* నక్కకు నవ్వు-ఎండ్రకాయకు గండం.
* నక్కకూత నాకలోకం ముట్టునా?
* నక్క కూసి నాశం తెచ్చు.
* నక్క కూసి పిల్లలకు దోవచూపు.

No comments:

Post a Comment