* గొఱ్ఱెకు ఎదురు, గుఱ్ఱానికి వెనుక పోరాదు.
* గొఱ్ఱె ఏడుస్తే తోడేలుకు విచారమా?
* గొఱ్ఱె కొవ్వి సెలకట్టె కొరికిందట.
* గొఱ్ఱె కొవ్వేదంతా కొల్లవానికే లాభం.
* గొఱ్ఱెదాటు, ఏలంవెఱ్ఱి.
* గొఱ్ఱెను అడిగి గొంతు కోస్తారా?
* గొఱ్ఱెను తినేవాడు పోతే, బఱ్ఱెను తినేవాడు వచ్చినట్లు.
* గొఱ్ఱె పడుకున్న చోట బొచ్చెంత రాలిందని చూచినట్లు.
* గొఱ్ఱె పెంట ఏడాది, ఆవులపెండ ఆరేండ్లు.
* గొఱ్ఱె బలిసి చింత కొరికినట్లు.
* గొఱ్ఱె మంద కంటే, లోతు దుక్కి మేలు.
* గొఱ్ఱెల మందలో తోడేలు పడినట్లు.
* గొఱ్ఱెలు కాచినందుకు, లొడుగు తాగినందుకు సరి.
* గొల్లకంపు గాలి కొట్టింది అత్తగారు అంటే, అంటు అయినది కుండలో నీరు పారబోయి కోడాలా అన్నదిట.
* గొల్ల చల్ల పుల్లన, గున్న చింత నల్లన.
* గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు.
* గొల్ల మెండు ఇల్లు పట్టదు.
* గొల్లల యిరదాళ్ళు (వీరత్రాళ్ళు) లేని గంగమ్మ కొలువు వలె.
* గొల్లల గోత్రాలు గొఱ్ఱెల కెఱుక, గొఱ్ఱెల గోత్రాలు గొల్లలకెఱుక.
* గొల్లవాడా ! గొల్లవాడా! ధాన్యం ఎక్కడుందీ? అంటే, నా గొఱ్ఱె ముడ్డిలో ఉంది అన్నాడట.
* గొల్లవాడి ఇంట పెండ్లి తెల్లవారుతుంది.
* గొల్లవాడి కొమ్ము హెచ్చనూ హెచ్చదు, తగ్గనూ తగ్గదు.
* గొల్లవాడు గొఱ్ఱెపిల్లను చంకనుబెట్టుకొని, అడవంతా వెతికినట్లు.
* గొల్ల సుద్దులు, గోవింద రొట్టెలు.
* గొల్ల సుద్దులు, పిల్ల ముద్దులు.
* గొల్లింట గుఱ్ఱాలు, కుక్కపిల్లలు, ఆవులు ఆడుబిడ్దలు.
* గొళ్ళెంలేని తలుపు, కళ్ళెంలేని గుఱ్ఱము.

No comments:
Post a Comment