Sunday, July 14, 2019

ప - ఫ >>>> 13

* పాపి చిరాయువు, సుకృతికి గతాయువు.
* పాపి పర్వతం బోతే, దీపాలన్ని పెద్దవైనవట.
* పాపి సముద్రానికి పోతే, అరికాలు తేమ కాలేదట.
* పాపిసొమ్ము పరులపాలు, ద్రోహిసొమ్ము దొరలపాలు.
* పామనగ వేరే పరదేశమున లేదు.
* పామరజనానికి ఎన్నో తలలున్నవి గానీ, ఒకమెడైనా లేదు.
* పాముకన్నా లేదు పాపిస్టిదగు జీవి.
* పాము కరచును, అరవ చెరచును.
* పాముకాటు చీరతో తుడిచిన పోవునా?
* పాముకాళ్ళు పాముకే ఎఱుక.
* పాముకు బదనిక చూపినట్లు.
* పాముకు విషం పండ్లలో, ఙ్ఞాతికి విషం కండ్లలో.
* పాము చుట్టము: పడగ పగ.
* పాము చెలిమి, రాజు చెలిమి ఒకటే.
* పాముతో చెలిమి కత్తితో సాము వంటిది.
* పాము పగ, తోక చుట్టము.
* పాము పడగ క్రింద కప్ప ఉన్నట్లు. (సర్పంబు పడగనీడను కప్పవసించినట్లు).
* పాము మాదిరి కడకు గామైనట్లు.
* పాములలో మెలగవచ్చునుగానీ సాములలో మెలగటం కష్టం.
* పాములు లేనివాడు, వానపామును పట్టుకొన్నట్లు.
* పాము వంటిదానికే విరుగుడుంటే, పంతుల కుండదా?
* పాము వరటకపోతే, దాని విషం వరటకపోతుందా?
* పాము చావకుండా, బడితె విరగకుండా.
* పాయసంలో నెయ్యి ఒలికినట్లు.
* పారవేసిన పుల్లాకు బండి కల్లైనట్లు.
* పారిజాతముతో ప్రబ్బిళ్ళు సరితూగునా?
* పారినవాని పౌరుషం ఎన్నాలనా?
* పారుబోతు గొడ్డుకు పగ్గం చాటైతే చాలు.
* పారేనీటికి పాటినలేదు.
* పారేబంద్లకు కాళ్ళు చాచిన నిలుచునా?

No comments:

Post a Comment