Sunday, July 14, 2019

ప - ఫ >>>> 14

* పాలకంకు లోయి దాసరీ అంటే రాలిన మట్టుకే గోవిందా అన్నడట.
* పాల కోసరం పొదుగు కోసినట్లు.
* పాలకు కాపల, పిల్లికి తోడు.
* పాలకడలి లంకలో బుట్టినా కొంగకు తిండి నత్తగుల్లలే.
* పాలతోగూడా విషము పెట్టినట్లు.
* పాలను చూడనా? విషాన్ని చూడనా?
* పాలపొంగు - పడుచుపొంగు.
* పాలపొంగు - మీలపొంగు.
* పాలలో పంచదార ఒలికినట్లు.
* పాలలో పడ్డ బల్లివలె.
* పాలసముద్రంలోని హంస పడియనీటి కాసపడుతుందా?
* పాలికివచ్చింది పంచామృతము.
* పాలివాడు చస్తే పారెడు మన్నెక్కువ.
* పాలివానికి చేసినమేలు - పీనుగకు చేసిన శృంగారం.
* పాలివారిని చెరచితివో, పాడైతివో.
* పాలుఇచ్చే బఱ్ఱెను అమ్మి, పైన ఎక్కే దున్నను తెచ్చుకొన్నట్లు.
* పాలు ఒల్లని పిల్లి ఉన్నడా?
* పాలు కుడిచి ఱొమ్ము గ్రుద్దినట్లు.
* పాలు చిక్కనైతే వెన్న వెక్కసము.
* పాలు పిండగలము గానీ, తిరిగి చంటిలోకి ఎక్కించగలమా?
* పాలు పిందని గొడ్డు బఱ్ఱెల కదుపులు మెండు.
* పాలు పిందను బఱ్ఱె పలు మేతలకు పెద్ద.
* పాలు పొంగడమంతా పొయ్యి పాలుకే.
* పాలు బోసి పెంచినా పాము కఱవక మానదు.
* పాలు బోసి పెంచినా పాముకు విషము పోదు.
* పాలు బోసి పెంచినా ముష్టిచెట్టుకు విషము పోదు.
* పాలు బోసి పెంచినా వేపకు చేదు పోదు (తీపిరాదు).
* పాలుమాలితివో, ఆర్చుకొంటివో!
* పాలేరు దున్నినవాడు అప్పులపాలు.
* పాలేరువానికి పశువు పోయినా, మారుతల్లి బిడ్డపోయినా దిగులులేదు.

No comments:

Post a Comment