Saturday, July 13, 2019

గ - ఘ >>>> 15

* గోంగూరలో చింతకాయ వేసినట్లు.
* గోకి దురద తెచ్చుకొన్నట్లు.
* గోకుడుకు గోకుడే మందు.
* గోకులాష్టమికి పీర్ల తిరునాళ్ళకు (పండుగకు) సంభందమేమి?
* గోగు పెళు(డు)సు, గొల్ల బిరుసు.
* గోచీకి ఎక్కువ కోకకు తక్కువ.
* గోచీకి పెద్దా, కోకకు చిన్న.
* గోచీకి పెద్ద, గవాంచాకు చిన్న.
* గోచీకి మించిన దరిద్రం లేదు, ఈతకు మించిన లోతులేదు.
* గోచిపాతల రాయడు దొంగలకు మిండడు.
* గోచీలో గొంగడి చించుతాడు.
* గోచీ విప్పి పాగా చుట్టినట్లు.
* గోటితో పోయే మనికి (త్రుంచేపనికి) గొడ్డలి ఎందుకు?
* గోడ ఉంటే చిత్రం వ్రాయవచ్చు.
* గోడకుపూసిన సున్నము విడెములోనికి వచ్చునా?
* గోడకు పెట్టిన సున్నము, లంజకు పెట్టిన సొమ్ము తిరిగిరావు.
* గోడపై సున్నం గోకితే రాదు.
* గోడదూకిన వాడెవడంటే, ఆలుచచ్చిన వాడన్నట్లు.
* గోడనుబెట్టి త(డి)డక తన్నాలిగానీ, తడకగట్టి గోడను తన్నరాదు.
* గోడపట్టుకో, కూలి అడిగివస్తాను.
* గోడమీది పిల్లివాటము, కోమటి సాక్ష్యము.
* గోడలకు చెవులుంటాయి, నీడలకు నోళ్ళుంటాయి.
* గోతిని త్రవ్వినవాడే అందులో పడేది.
* గోదావరి పారినా, కుక్కకు గతుకు నీళ్ళే గతి.
* గోదావరి పారిందీ, గొద్దెలేరూ పారింది.
* గోధుమలు వేస్తే బాదములు పండునా?
* గోనెల కంటే గోతులు మెండు.
* గోనెలే కొత్తవి, కోడె లెప్పటివే.
* గోప్రదక్షిణము, భూప్రదక్షిణ ఫల మిచ్చినట్లు.
* గోముఖ వ్యాఘ్రం.

No comments:

Post a Comment