Saturday, July 13, 2019

చ - ఛ >>>> 14

* చెదలుకాళ్ళవాడు క్షణ మొకచోట నిలువడు.
* చెన్నంపల్లి పంచాయతి చెరిసొగం.
* చెప్పంత పొలం చెప్పినట్లు కొనాలి.
* చెప్పకపోయినా దుప్పికొమ్ముల ఎద్దునే కొను.
* చెప్పటం తేలిక, చెయ్యటం కష్టం.
* చెప్పనేర్చిన మాట సెబాస్ మాట.
* చెప్పింది చేయబోకురా! చేసేది చెప్పబోకురా.
* చెప్పి చెప్పి చెప్పుతో కొట్టించుకో, మళ్ళీ వచ్చి మాతో తన్నించుకో.
* చెపితే పాపంగానీ, తిరగేసి పొడిస్తే చస్తుంది అన్నట్లు.
* చెపితే సిగ్గు దాస్తే దుఃఖం.
* చెప్పినంత చేసేవారు శివుడికన్నా లేరు.
* చెప్పిన కొద్ది చెవుడు పడిపోతారు.
* చెప్పిన బుద్ధి, కట్టిన సద్ది ఎంతకాలం నిలుచును?
* చెప్పిన మాట విని వచ్చేవాడిని చెవు బట్టుకొని లాక్కొచ్చి, ఎదురు తిరిగిన వాడికి సాక్ష్యం బెట్టి వచ్చినా.
* చెప్పుకాలు నెత్తిన బెట్టి శఠగోపుర మంటాడు.
* చెప్పు కింద తేలువలె.
* చెప్పు కొరికినామని సిద్ది కొరుకుతామా?
* చెప్పటం కంటే చెయ్యటం మేలు.
* చెప్పుడూ మాటలకన్నా తప్పుడు మాటలు నయం.
* చెప్పుతో కొట్టి శఠగోపం పెట్టినట్లు.
* చెప్పు తినెడి కుక్క చెఱుకు తీపెరుగునా?
* చెప్పు పట్టుగుడ్డలో చుట్టి కొట్టినట్లు.
* చెప్పులవానికి చేనంతా తోలుతో కప్పినట్లుంటుంది.
* చెప్పులు ఉన్నవాడితోనూ, అప్పులున్నవాడితోనూ పోరాదు.
* చెప్పులు చిన్నవని కాలు తెగకోసుకుంటారా?
* చెప్పులు ఉన్నా, చెప్పులు తెగినా చుట్ట(ట్టి)రికం తప్పదు.
* చెప్పులోని రాయి- చెవిలోని జోరీగ-ఇంటిలోని పోరు.
* చెప్పుడుమాటలు చేటు.
* చెప్పేది చెవిదగ్గఱ, వినేది రోటిదగ్గఱ.
* చెప్పేవానికి చేదస్తమయితే, వినేవానికి వివేకం వద్దా?

No comments:

Post a Comment